బిజినెస్

45మిలియన్ టన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) 45 మిలియన్ టన్నుల ముడి ఇనుము (ఐరన్ ఓర్) ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి అవుతుందని అంచనావేశారు. ఎన్‌ఎండిసి తొలుత రూపొందించిన లక్ష్యం ప్రకారం 2017-18 లో 37 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి చేయాల్సి ఉంది. సాంకేతికపరమైన కారణాల వల్ల తాము 2017-18 సంవత్సరానికి నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేపోతున్నామని ఎన్‌ఎండిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బజేంద్రకుమార్ తెలిపారు. పిటిఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ, 2022 నాటికి ముడి ఇనుము ఉత్పత్తి 67 మిలియన్ టన్నులకు పెంచాలని భావిస్తున్నామన్నారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గనుల తవ్వకం నిలిపివేసిన ఒడిషాలో తిరిగి గనుల తవ్వకం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని బజేంద్రకుమార్ తెలిపారు. ఇందుకోసం ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశామన్నారు. ఎన్‌ఎండిసి డైరెక్టర్లు ఎన్‌కె నందా, పికె సత్పతిలను ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎపి పథితో చర్చించేందుకు పంపించామన్నారు. ఒడిషాలో గనుల తవ్వకాన్ని నిలిపివేసినందువల్ల 2017-18 సంవత్సరం లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని వివరించారు. అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌ఎండిసి సిఎండి వెల్లడించారు.