బిజినెస్

ద్రవ్యోల్బణం, ఫెడ్ సమీక్ష కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్ష సమాచారం, అంతర్జాతీయ పరిణామాలు కూడా ముఖ్యమేనని చెబుతున్నారు. ‘కీలకమైన అంతర్జాతీయ పరిణామాలు, వర్షాల ప్రగతి సమాచారం ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయి. ఈసారి వర్షాలు ఎలా ఉంటాయోనన్నదానిపై మదుపరులు తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. ఇకపోతే సోమవారం విడుదలయ్యే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదలవుతుండటంతో వీటి ఆధారంగా కూడా మదుపరులు తమ పెట్టుబడులపై ఓ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు వంటివి కూడా ఈ వారం మార్కెట్ తీరును శాసిస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి కీలక వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాల మధ్య జరిగే అమెరికా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష ప్రధానమని అంటున్నారు.