బిజినెస్

చమురు ధరలు తగ్గాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఉత్పత్తి దేశాలయిన సౌదీ అరేబియా, అమెరికాలను చమురు ధరలు తగ్గించాల్సిందిగా భారత్ ఈ నెలలో కోరనుంది. ఇంధన వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు చమురు ధరలు తగ్గించాల్సిందిగా భారత్ ఈ రెండు దేశాలను కోరనుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం తెలిపారు. సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్ అ అల్ ఫలీహ్ ఈ నెల 23, 24 తేదీలలో భారత్‌లో పర్యటించనున్నారని, అమెరికా ఇంధన మంత్రి రిక్ పెర్రీ ఫిబ్రవరి 28- మార్చి ఒకటో తేదీ మధ్య భారత్‌లో పర్యటిస్తారని ప్రధాన్ వెల్లడించారు. చమురు ధరలు తగ్గవలసిన అవసరం ఉందని తాము అభిప్రాయపడుతున్నామని మంత్రి ప్రధాన్ గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రపంచంలో చమురు వినియోగంలో మూడో అతి పెద్ద దేశమయిన భారత్.. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలయిన సౌదీ అరేబియా, అమెరికాల దృష్టికి ప్రస్తుతం అధిక స్థాయిల వద్ద ఉన్న చమురు ధరల అంశాన్ని తీసికెళ్తామని, ఈ ధరలను హేతుబద్ధమయిన స్థాయికి తగ్గించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతామని ప్రధాన్ తెలిపారు. వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ఎందుకు తగ్గంచలేదని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర జనవరి చివరలో నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి అయిన బారెల్‌కు 71 డాలర్లకు పెరిగి, అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 శాతం తగ్గింది. గురువారం బారెల్‌కు 65.37 డాలర్ల వద్ద క్రయవిక్రయాలు జరిగాయి.