బిజినెస్

7.5 శాతానికి పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరుతుందని, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం తగ్గడంతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సమీప భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం స్వల్పంగా ఉందని ఒక తాజా నివేదిక వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వల్ల తలెత్తిన తాత్కాలిక అవాంతరాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోయిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పుంజుకునే అవకాశాలు ఉన్నాయని సోమవారం విడుదలయిన డచ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. ‘2018-19లో వృద్ధి రేటు పుంజుకుంటుందనే ఆశావాదం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వాస్తవ దేశ స్థూల జాతీయాభివృద్ధి (జీడీపీ) 7.5 శాతం నమోదవుతుందని ప్రస్తుత అంచనా’ అని ఆ నివేదిక పేర్కొంది. వృద్ధి రేటు కోలుకునే స్వరూపం, ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఎలా ఉంటాయి, వేసవి రుతుపవనాలు ఎలా ఉంటాయి, కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) ఎంత మేరకు పెరుగుతాయి, ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి ఏ స్థాయిలో ఉంటుంది అనే వాటిని అంచనా వేయడానికి రానున్న కొన్ని నెలలు ఎంతో కీలకమయినవని ఆ నివేదిక తెలిపింది. డచ్ బ్యాంక్ నివేదిక ప్రకారం, 2018 సంవత్సరం అంతా కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఆరు శాతమే ఉంటాయి. వృద్ధి రేటు పుంజుకోవడానికి ఇది దోహదపడుతుంది.