బిజినెస్

పాల వ్యాపారంలోకి పతంజలి: రామ్‌దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 12: యోగా గురువు రామ్‌దేవ్ బాబా.. పతంజలి ఉత్పత్తులను మరింత విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మరిన్ని పాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెస్తామని ఆదివారం ఇక్కడ చెప్పారు. వచ్చే ఏడాదికల్లా 10,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామని, దాన్ని సాధించడంలో భాగంగానే వ్యాపార విస్తరణ అన్నారు. ఈ క్రమంలోనే పాల అమ్మకాల్లోకీ దిగనున్నట్లు స్పష్టం చేశారు. రైతుల సాధికారితే ధ్యేయంగా తాము ఈ వ్యాపారాన్ని ప్రారంభించదలిచామన్నారు. పతంజలి గ్రూప్.. సహజసిద్ధమైన ఔషధాలు, ఆహారం, సౌందర్య సాధనాలు, పాల ఉత్పత్తులు తదితర వ్యాపారాలపై దృష్టి పెట్టిందన్నారు. వీటిలో పురోగతి దిశగా వెళ్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.