బిజినెస్

28న ‘ఫ్రీడమ్ 251’ అందిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: రింగింగ్ బెల్స్.. 251 రూపాయలకే స్మార్ట్ఫోన్ అంటూ ప్రకటించి, దాన్ని అట్టహాసంగా ప్రారంభించిన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ తమ చౌక స్మార్ట్ఫోన్లను ఈ నెల 28 నుంచి కస్టమర్లకు అందించడం మొదలుపెడతామంటోంది. పలు నాటకీయ పరిణామాల మధ్య ‘ఫ్రీడమ్ 251’ పేరుతో పరిచయమైన ఈ 251 రూపాయల స్మార్ట్ఫోన్ బుకింగ్ సమయంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నది తెలిసిందే.
బుకింగ్స్ ఆరంభమైన కాసేపటికే ఓవర్‌లోడ్‌తో సర్వర్లు డౌనై బుకింగ్స్ ఆగిపోవడం, ఒక రోజు తర్వాత మళ్లీ మొదలు కావడం, వినియోగదారుల ఖాతాల్లోంచి నగదు బదలాయింపులు జరిగినా.. ఫోన్ బుకింగ్స్ కాకపోవడం, చివరకు బుకింగ్స్‌ను నిలిపివేసిన సంస్థ.. పలు ఆరోపణల నడుమ వినియోగదారుల నుంచి అందుకున్న 251 రూపాయల ముందస్తు డిపాజిట్‌ను తిరిగి చెల్లిస్తామని ప్రకటించడం, ఫోన్ అందిన సమయంలోనే తీసుకుంటామని ప్రకటించడం ఇలా ఎన్నో జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయెల్ పిటిఐతో మాట్లాడుతూ ‘జూన్ 28 నుంచి ఫ్రీడమ్ 251 పంపిణీని మేము ఆరంభిస్తున్నాం. కస్టమర్లకు క్యాష్ ఆన్ డెలివరీపై వీటిని అందిస్తాం.’ అని చెప్పారు. కాగా, రెండు రోజులు జరిగిన బుకింగ్స్‌లో రికార్డు స్థాయిలో ఈ ఫోన్ బుకింగ్స్ నమోదవగా, దాదాపు 30,000 మంది కస్టమర్లు ఫోన్ బుకింగ్ కోసం నగదును చెల్లించారని సంస్థ తెలిపింది. 7 కోట్లకుపైగా కస్టమర్లు ఫోన్‌ను బుక్ చేసుకున్నారని ప్రకటించింది. ఇకపోతే మొబైల్‌రంగ సంస్థలు ‘ఫ్రీడమ్ 251’ వ్యవహారంపై విచారణ జరపాలని, అంత తక్కువ ధరకే ఎలా ఇస్తారని ప్రశ్నించినది తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్ రాకతో మార్కెట్‌లో మిగతా సంస్థల ఉనికి ప్రమాదంలో పడుతుందని భారత సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) ఆందోళన వ్యక్తం చేస్తూ టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖను కూడా ఐసిఎ రాసింది. అయితే ఫోన్ అసలు 2,500 రూపాయలని, కానీ ఎకనామీస్ ఆఫ్ స్కేల్, ఇన్నోవేటివ్ మార్కెటింగ్, పన్నుల్లో మినహాయింపు, ఈ-మార్కెటింగ్ వంటి వాటి ద్వారా తక్కువకు అందిస్తున్నామని సంస్థ అధ్యక్షుడు అశోక్ చద్దా గతంలోనే సమాధానమిచ్చారు. ఇదిలావుంటే నోయిడా, ఉత్తరాంచల్‌లోని తయారీ కేంద్రాల్లో ఈ 251 ఫోన్ తయారవుతున్నట్లు రింగింగ్ బెల్స్ చెబుతోంది. అతి తక్కువ ధరతో వస్తున్న ఫ్రీడమ్ 251ను 4 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కమ్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్‌తో రూపొందించినట్లు సంస్థ అంటుండగా, ఆండ్రాయిడ్ లాలీపప్ ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 8 జిబి. దీన్ని 32 జిబి వరకు పెంచుకోవచ్చు. 3.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 1,450 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఉమెన్ సేఫ్టీ, స్వచ్ఛ్ భారత్, ఫిషర్‌మెన్, ఫార్మర్, మెడికల్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి. మొత్తానికి ఈ నెల 28నైనా ఫ్రీడమ్ 251 వ్యవహారంపై ఓ స్పష్టత వస్తుందో చూడాలి.

మార్కెట్‌లోకి ‘ఫ్రీడమ్ 251’ విడుదల దృశ్యం (ఫైల్ ఫోటో)