బిజినెస్

డిజిటల్ యూపీతోనే డిజిటల్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 22:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ‘డిజిటల్ రాష్ట్రం’గా మార్చకుండా ‘డిజిటల్ ఇండియా’ స్వప్నం సాకారం కాదని సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అందుకే ఈ రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని ఆయన వ్యాపార వాణిజ్య వర్గాలను కోరారు. లక్నోలో జరుగుతున్న యూపీ పెట్టుబడిదారు సమ్మేళనంలో పాల్గొన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో వేగంగా ఐటీ రంగం అభివృద్ధి చెందుతోందని, 130 కోట్లమందిలో 121 కోట్ల మందివద్ద మొబలై ఫోన్లు ఉన్నాయని, 40-45 కోట్లమందికి స్మార్ట్ పోన్లు ఉన్నాయని అన్నారు. దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రాముఖ్యతను చెబుతూ ఈ రాష్ట్రం డిజిటల్ రంగంలో అభ్యున్నతి సాధించకుండా డిజిటల్ ఇండియా ధ్యేయం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచం అంతటా డిజిటల్ విప్లవం వెల్లువెత్తుతోంది. ఈ పోటీలో భారత్ వెనుకబడాలని తాను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ రంగంలో వాణిజ్యానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.’ అని చెప్పిన రవిశంకర్ అందుకే యూపీలో ఐటీ రంగం అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. 2020 నాటికి ప్రపంచ ప్రజలు వాడే మొబైల్ ఫోన్లలో అత్యధిక శాతం భారత్‌లో తయారు చేసినవే ఉంటాయని ఆయన ధీమాగా చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 2 మొబల్ ఉత్పత్తి కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు 118కి పెరిగాయని, నోకియా మూతబడిందని, ఆ 118 కేంద్రాల్లో 58 యూపీలోని నోయిడాలోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. నోయిడా, గ్రేటర్ నోయిడా సింగపూర్ తరహాలో అభివృద్ధి చెందడానికి పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పిన రవిశంకర్ ప్రసాద్ బీపీఓల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గోరఖ్‌పూర్, డోరియా వంటి ప్రాతాల్లో వీటన ఏర్పాటు చేయాలని సూచించారు. యూపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనుందని, కొత్త పెట్టుబడులు, వాణిజ్య ప్రతిపాదనలను ఇక ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారని, పాత దశలవారీ అనుమతుల విధానం ఉండదని, రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం చేయూతనిస్తుందని రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికి దేశంలో కేవలం 358 కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ మాత్రమే ఉందని, ఆ తరువాత తమ ప్రభుత్వం చర్యలు చేపట్టి మరో 2.10 లక్షల కి.మీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామన్నారు.