బిజినెస్

కొనుగోళ్ల జోష్‌లో ఎఫ్‌పిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్ల లోకి ఈ నెలలో ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడు లను తెచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు, సానుకూల స్థూల ఆర్థిక గణాంకాలు మదుపరులను పెట్టుబడుల వైపునకు మళ్లించాయ. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధిరేటు 7.9 శాతంగా నమోదు కావడం, గత ఆర్థిక సంవత్సరం (2015-16) మొత్తం గా వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. కాగా, ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాస తోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 32,000 కోట్ల రూపా యలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొ చ్చారు. అంతకుముందు జనవరి, ఫిబ్రవరి నెలల్లో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. ఇదిలావుంటే ఈ నెల 1-9 మధ్య స్టాక్ మార్కెట్ల లోకి 3,727 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్ల నుంచి 1,833 కోట్ల రూపాయల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. మరోవైపు ఈ ఏడాది మొదలు ఇప్పటి దాకా స్టాక్ మార్కెట్లలోకి 19,180 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. ఇదే సమయంలో రుణ మార్కెట్ల నుంచి 7,181 కోట్ల రూపా యల పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర విదేశీ పెట్టుబడుల విలువ 11,999 కోట్ల రూపాయలుగా నిలిచింది. అయతే నిరుడు 2015లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ కేవలం 17,806 కోట్ల రూపాయలు (3.2 బిలియన్ డాలర్లు) గా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 45,856 కోట్ల రూపాయలు (7.4 బిలియన్ డాలర్లు)గా ఉంది. మొత్తంగా అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ మదుపరుల పెట్టుబడుల విలువ 63,662 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది 2014లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువే దాదాపు లక్ష కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. 2012, 2013 సంవత్సరాల్లోనూ లక్ష కోట్ల రూపాయల చొప్పున విదేశీ పెట్టుబడులు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక రుణ మార్కెట్లలోకి 2014లో వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 1.6 లక్షల కోట్ల రూపాయలు (26 బిలియన్ డాలర్లు)గా ఉంది. 2014లో మొత్తం రెండున్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి తరలివ చ్చాయ. అయతే 2013లో రుణ మార్కెట్ల నుంచి 51,000 కోట్ల రూపాయల (8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కిపోయాయ. అంతకు ముందు 2012లో 35,000 కోట్ల రూపాయలు, 2011లో 42,000 కోట్ల రూపాయలు, 2010లో 46,408 కోట్ల రూపాయల పెట్టుబడుల చొప్పున విదేశీ మదురులు తెచ్చారు.