బిజినెస్

వ్యక్తిగత, వృత్తి నైపుణ్యమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: నిర్దేశించుకున్న రంగం ఏదైనా రాణించేందుకు వ్యక్తిగత, వృత్తిపరమైన నైపుణ్యత ఎంతో అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య సదస్సు చివరి రోజు సోమవారం ‘ది యూనివర్శ్ ఆఫ్ స్టార్టప్స్’ అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. చర్చకు సంధాన కర్తగా వ్యవహరించిన సీఐఐ స్టార్టప్ కౌన్సిల్ అండ్ కో ఫౌండర్ ఎస్ గోపాకృష్ణన్ మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో అత్యధికంగా స్టార్టప్ కంపెనీలు రానున్నాయని, తద్వారా అనేక ఉపాధి అవకాశాలు కలుగే వీలుందన్నారు. గుగూల్, ఫేస్‌బుక్, అమెజాన్, ఆపిల్ వంటి సంస్థలతో పాటు రానున్న పలు స్టార్టప్ కంపెనీలకు అనుకూల వాతావరణం కల్పించే బాధ్యత ఉందన్నారు. పేనలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీ ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు రావడానికి, వచ్చిన స్టార్టప్‌ల ఎకో సిస్టం మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను విశే్లషించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ప్యానలిస్టులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి వ్యవస్థాపకతపై శిక్షణ ఇవ్వాలన్నారు. దీనికోసం యూనివర్శిటీలు, కళాశాలలు, వృత్తివిద్యా సంస్థలు ఆ తరహా బోధనాంశాల ద్వారా యువతలో ఆసక్తి కలగజేయాలన్నారు. స్టార్టప్ సంస్థలు విద్యా సంస్థలుగా ఎదిగినప్పుడే అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించినట్టు అవుతుందన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన నైపుణ్యాలకు మెంటార్‌షిప్ ఉపకరిస్తుందని, దీని ద్వారానే మంచి ఎకోసిస్టం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఔత్సాహికులకు అవసరమైన అన్ని విధాలా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాలిఫోర్నియా ప్రతినిధి అంకుర్ జైన్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోను రాణించగలరని, వారు పనిచేస్తున్న సంస్థల్లో రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారని నెదర్లాండ్స్ ప్రతినిధి బెన్ మార్జిలిన్ హోల్డర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రతినిధి బెన్ హామిల్‌టన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ పాత్ర ఎంతో కీలకమన్నారు. శక్తివనరులు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల్లో గత పదేళ్లలో ప్రభుత్వం అనేక గ్రాంట్లను, సబ్సిడీలను ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. భారత దేశంలో అంకుర సంస్థలు తక్కువగా ఉన్నాయని, స్టార్టప్ సంస్థలకు ఇంక్యుబేటర్ల, మెంటర్ల అవసరం ఎంతైనా ఉందన్నారు. నీతి అయోగ్ మిషన్ డైరెక్టర్ ఆర్ రమణన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నంచి టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా నూతన ఆవిష్కరణలు చేసే విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందకు వెళ్లాలన్నారు. తాగునీరు, వ్యర్థాల నిర్వహణపై ప్రాజెక్టును నీతి అయోగ్ ఆధ్వర్యంలో ప్రారంభించామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీ స్టార్టప్‌ల కోసం కోట్ల రూపాయలతో వౌలిక వసతులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. దార్శినికుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టార్టప్స్ కోసం హాక్‌థాన్‌లు నిర్వహిస్తూ అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పెద్ద సవాలుగా నిలిచిందని, తాగునీటి నాణ్యత ప్రమాణాలను రియల్‌టైంలో తనిఖీలు చేసేందుకు 60 విధానాలను అనుసరిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థాయిలో సూక్ష్మతరహా పరిశ్రమల స్థాపనకు అవసరమైన వౌలిక వసతుల కల్పన జరుగుతోందన్నారు. కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లకు వచ్చే వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న పథకాలపై 10 స్టార్ రేటింగ్ ఇస్తున్నట్టు తెలిపారు,. ఒక కుటుంబానికి నెలకు రూ.10వేలు ఆదాయం లభించే విధంగా హేపీనెస్ ఇండికేటర్ పనిచేస్తుందన్నారు. చర్చా కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పీ అశోక్ గజపతి రాజు, ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ కే హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.