బిజినెస్

సుబాబుల్ కొనుగోలు ధర ఖరారు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 27: గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు సుబాబుల్, జామాయిల్ కొనుగోలు ధరలు ఖరారు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. రైతుల నుండి పేపరుమిల్లుల యాజమాన్యాలు సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు అంశంపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో మంగళవారం సమావేశమైంది. మంత్రులు ఆదినారాయణరెడ్డి, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయస్వామి, మార్కెటింగ్ శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్ పాల్గొన్న ఈ సమావేశంలో సుబాబుల్ ధర టన్నుకు రూ.4,200లుగా, జామాయిల్ రూ.4,400 లుగా నిర్ణయించారు. కర్ర నరికిన కూలీ, రవాణా ఖర్చులు, కర్ర తోలు వలిచిన కూలి మినహాయించి రైతు నుండి నేరుగా కర్ర కొనుగోలుకు వీలుగా నికర ధరను నిర్ణయించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. చెల్లింపులు ఆన్‌లైన్‌లో చేయాలని తెలిపారు. ప్రతి జిల్లా నుంచి కొనవలసిన కర్ర పరిమాణాన్ని నిర్ణయించి పేపర్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. వీలైనంతవరకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని, బిల్ట్ ట్రీ టెక్ కంపెనీ నుంచి రూ.40కోట్లు బకాయిలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.