బిజినెస్

నైపుణ్య శిక్షణ, ముద్రాపై ప్రధాని మోదీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 28: ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి కౌశల్ యోజన (పీఎంకేవీవై), ప్రధాన మంత్రి ముద్ర (మైక్రో డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన పథకాలను సమీక్షించారు. సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరం నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏన్‌ఏస్‌డీసీ) ద్వారా 75 శాతం పీఏంకేవీవై నిధులు వినియోగించి యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించినట్లు అధికారులు ప్రధానికి వివరించారు. 33 భాగస్వామ్య పరిశ్రమలు రూ. 100 కోట్లు సహాయం అందించినట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సాంఘీక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు.