బిజినెస్

కడప - విజయవాడ విమాన సర్వీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 1: కడప నుంచి విజయవాడకు ట్రూజెట్ విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది. ఈ విమానం విజయవాడ నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు బయలుదేరి కడపకు చేరుకుంటుంది. తిరిగి కడప నుంచి తిరిగి 9.30 గంటలకు విజయవాడకు బయలుదేరుతుంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి కడప విమానాశ్రయం నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత హైదరాబాద్‌కు కడప నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నారు. తరువాత చెన్నైకి నడిపారు. ప్రస్తుతం విజయవాడకు విమానం నడుపుతున్నారు. త్వరలో చెన్నై, మైసూరుకు కనెక్టివిటీ సర్వీసులు నడుపుతారు. ఈ నెలాఖరులో ఎయిర్ ఏషియా వారు చెన్నై-కడప-చెన్నై మార్గంలో విమాన సర్వీసు ప్రారంభించనున్నారు. పండుగ రోజుల్లో టికెట్ ధర సగానికి సగం తగ్గిస్తున్నట్లు ట్రూజెట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పూసర్ల శివప్రసాద్, ట్రూజెట్ ఆపరేషన్స్ హెడ్ ప్రసాద్ పాల్గొన్నారు.