బిజినెస్

15 బిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 15 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంకోసం భారత్-వియత్నాంలు అనువైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ మేరకు రెండు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. శనివారం ప్రధాని నరేంద్రమోది, వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్‌ల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి సబ్-కమిషన్ స్థాయి సమావేశం, ఈ ఏడాది సాధ్యమైనంత త్వరలో వియత్నాం రాజధాని హనోయ్‌లో నిర్వహించనున్నట్టు ప్రకటన వెల్లడించింది. 2020 నాటికి వాణిజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకోసం రెండు దేశాల వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థల మధ్య ఎప్పటికప్పుడు పరస్పరం చర్చలు కొనసాగాలని నిర్ణయించినట్టు కూడా ప్రకటన స్పష్టం చేసింది. కాగా భారత్‌ను ‘ఈజ్ డూయింగ్ బిజినెస్’ దిశగా తీర్చిదిద్దినందుకు వియత్నాం అధ్యక్షుడు మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఇరుదేశాల మధ్య రక్షణ, సహజవాయు అనే్వషణ, థర్మల్, జలవిద్యుత్ రంగాల్లో సహకారం శరవేగంగా ముందుకు సాగుతున్నదని ప్రకటన స్పష్టం చేసింది. తమ దేశానికి చెందిన కాంటినెంటల్ షెల్ఫ్, ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతాల్లో చమురు, సహజవాయు నిక్షేపాల అనే్వషణకు భారతీయ కంపెనీలను వియ త్నాం అధ్యక్షుడు ఆహ్వానించారని ఉమ్మడి ప్రకటన పేర్కొంది. భారత్ అభ్యర్థన మేరకు ‘ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్’ ఒప్పందంపై సంతకాలు చేసే అంశాన్ని వియత్నాం పరిశీలిస్తున్నది.