బిజినెస్

రూ. 11వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఫారిన్ ఇనె్వస్టర్లు ఫిబ్రవరి నెలలో భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 11వేల కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. అయిదు నెలల కాలంలో వారు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇదే మొదటిసారి. అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లలో మెరుగయిన అవకాశాలు ఉండటం వల్లనే వారు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను గణనీయంగా ఉపసంహరించుకున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) జనవరి నెలలో తీసుకున్న వైఖరికి ఇది భిన్నంగా ఉంది. వారు జనవరి నెలలో భారత ఈక్విటీ మార్కెట్‌లో రూ. 13,781 కోట్ల పెట్టుబడులు పెట్టారు. బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మెరుగయిన అవకాశాలు ఉండటంతో పాటు ప్రపంచ పరిణామాలు కూడా ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడానికి కారణమని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ విక్రం లిమాయే పేర్కొన్నారు.