బిజినెస్

‘ఎస్-400’ డీల్‌కు మోక్షం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఎస్-400ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు భారత్-రష్యాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రూ.40,000 కోట్ల విలువైన ఈ డీల్‌కు సంబంధించి ధర విషయంలో రెండు దేశాల మధ్య ఒక అంగీకారం కుదరలేదు. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో మాస్కోలో పర్యటించనున్న సందర్భంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చునని భావిస్తున్నారు. వాయు మార్గంలో జరిగే దాడులనుంచి రక్షణకోసం భారత్ ఎస్-400 ట్రింఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రష్యానుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నది. ముఖ్యంగా 4వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన చైనా మనకు పక్కలో బల్లెంగామారిన తరుణంలో, ఈ రక్షణ వ్యవస్థ ఏర్పాటు తప్పనిసరని భారత్ భావిస్తోంది. దేశంలోకి ప్రవేశించే డ్రోన్‌లు, క్షిపణులు, యుద్ధ విమానాలను 400 కిలోమీటర్ల దూరంలోనే ఈ వ్యవస్థ ధ్వంసం చేయగలదు. ఎస్-400 రష్యాకు చెందిన అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు.
ఈ క్షిపణీ వ్యవస్థను మొట్టమొదటగా చైనా, 2014లో రష్యానుంచి కొనుగోలు చేసింది. రెండు ప్రభుత్వాల మధ్య నేరుగా ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రష్యా, ఈ వ్యవస్థలను చైనాకు సరఫరా చేస్తున్నది. ఇదిలావుండగా మరో ఆరువారాల్లో నిర్మలా సీతారామన్ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడానికే రక్షణమంత్రి ప్రాధాన్యతనిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కనీసం ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయాలన్నది లక్ష్యం. కానీ ఇది ఏడాదిన్నరకాలంగా ఎటూతేలకుండా పడివుంది. ఈ క్షిపణి వ్యవస్థను అల్మజ్-ఆంటే సంస్థ తయారుచేస్తోంది.
ఇదిలావుండగా భారత్-రష్యాల మధ్య ఐదోతరం యుద్ధవిమానాకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అతీగతీలేకుండా పడివుంది. దీనికి కూడా అధిక ధరే కారణమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ గత ఏడాది తన నివేదికను సమర్పించింది. రక్షణ మంత్రిత్వశాఖ త్వరలోనే దీని దుమ్ము దులిపే అవకాశముంది. 2007లో భారత్ రష్యాల మధ్య ఎఫ్‌జిఎఫ్‌ఎ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరింది. 2010, డిసెంబర్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారత్ 295 మిలియన్ యుఎస్ డాలర్లు (రూ.1,897 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. ఈ మొత్తాన్ని యుద్ధవిమాన ప్రాథమిక డిజైన్ నిమిత్తం ఖర్చు చేస్తారు.
దీన్ని భారత్ ‘పర్‌స్పెక్టివ్ మల్టీ రోల్ ఫైటర్’ అని పిలుస్తోంది. కాని తర్వాతి సంవత్సరాల్లో జరిగిన చర్చలకు వివిధ అడ్డంకులు ఎదురయ్యాయి. 2016లోమనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా ఉండగా ఈ ప్రాజెక్టుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఈ సమస్య కూడా నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా ప్రస్తావనకు రానున్నది.