బిజినెస్

కోలుకున్న స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత ఆరు రోజులుగా వరుసగా నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు, గురువారం కొద్దిగా కోలుకున్నాయి. బీఎస్‌ఈ మొత్తం 318 పాయింట్లు కోలుకొని, 33,351.57 వద్ద ముగియగా, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,242.65 వద్ద ముగిసింది. ఈమధ్య పడిపోయిన స్టాక్‌లను మదుపర్లు తిరిగి కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపడం, ఉక్కు, అల్యూమినియంలపై విధించిన దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశమున్నట్టు అమెరికానుంచి సంకేతాలు రావడం, విదేశీ స్టాక్ మార్కెట్లు స్థిరంగా కొనసాగడం మన స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి దోహదం చేశాయి. ఫిబ్రవరి 23 నుంచి ఒక్కరోజులో స్టాక్ మార్కెట్లు ఇంతటి స్థాయిలో కోలుకోవడం ఇదే ప్రథమం. ఉక్కు రంగానికి చెందిన సంస్థల షేర్లు నేడు బాగా కోలుకోవడం గమనార్హం. నాల్కో, హిందూస్థాన్ జింక్ వరుసగా 1.83%, 1.15% లాభపడ్డాయి. మిగిలిన లోహ కంపెనీల షేర్లు 0.84 శాతం వృద్ధి చూపాయి. టాటాస్టీల్ అన్నింటికంటే ఎక్కువగా 1.93% లాభపడింది. ఐసిఐసీఐ బ్యాంకు, ఆదాని పోర్ట్స్ , ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఆసియన్ పెయింట్స్, మొదలైన సంస్థలు ప్రయోజనం పొందగా, ఎంటిఎన్‌ఎల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు 1.19 శాతం కుంగాయి.