బిజినెస్

పరస్పరం విత్తనాల సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థల మధ్య మంగళవారం విత్తనాల సరఫరాకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు నేతృత్వంలో మంగళవారం ఇక్కడ ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులతో పాటు, ఉత్తరప్రదేశ్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌కె ఖేరే పాల్గొన్నారు. వరిలో ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకంతో పాటు కెఎన్‌ఎం 118 విత్తనాలను ట్రయల్ కోసం ఉత్తరప్రదేశ్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు పంపించాలని నిర్ణయించారు. ఉత్తర ప్రదేశ్ నుండి దైంచా విత్తనాన్ని 2019 ఖరీఫ్‌కు ఉత్తరప్రదేశ్ సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది.
ఉత్తర ప్రదేశ్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో అమ్మకాలు కాకుండా మిగిలిపోయిన విత్తనాలను 3వ్యాల్యు యాడెడ్ ప్రోడక్ట్స్‌గా మారుస్తున్న విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు. పరస్పర ప్రయోజనాల కోసం రెండు సంస్థల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.