బిజినెస్

బేర్‌మన్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 16 : దేశ రాజకీయాల్లో వేగంగా వస్తున్న మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. ముఖ్యంగా తెలుగుదేశం ఎన్‌డిఎతో తెగదెంపులు చేసుకోవడం, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో, మార్కెట్‌లో అమ్మకాల వత్తిడి పెరిగిపోయి కేవలం ఒక్కరోజులోనే 510 పాయింట్లు పడిపోయి, 33,176 వద్ద ముగిసింది. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు ఒకే రోజులో ఈ స్థాయిలో మార్కెట్ పతనం కావడం ఇదే ప్రథమం. ఇక నిప్టీ కూడా 165 పాయింట్లు పడిపోయి 10,195 వద్ద ముగిసింది. సభ ఒక క్రమపద్ధతితో జరగడంలేదంటూ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, అవిశ్వాస తీర్మాన నోటీసులను తిరస్కరించి, సభను వాయిదా వేసినప్పటికీ మార్కెట్‌పై రాజకీయ సెంటిమెంట్ ప్రభావంతో మదుపర్లు అమ్మకాలవైపే మొగ్గు చూపారు.దీనికి తోడు ఇతర ఆసియన్ మార్కెట్లు కూడా నెగెటివ్ జోన్‌లోనే కొనసాగడం, గ్లోబల్ ట్రేడ్‌వార్ భయంతో అమ్మకాలు కొనసాగిన ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై పడింది. లోహ, చమురు, సహజవాయు, పిఎస్‌యు, విద్యుత్, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల అమ్మకాల ఒత్తిడితో మొదలైన మార్కెట్లు శుక్రవారం 509.54 పాయింట్లు నష్టపోయాయి. ఇక నిఫ్టీ కూడా 10,200 మార్కుకంటే దిగువకు పడిపోయి, 10,180.25 కనిష్ఠాన్ని తాకినప్పటికీ చివరకు 165 పాయింట్లు నష్టపోయి, 10,195.15 వద్ద ముగిసింది. కాగా టాటామోటార్స్ తీవ్రంగా నష్టపోగా, ఆసియన్ పెయింట్స్, ఆదాని పోర్ట్స్, ఎన్‌టిపిసి, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డిఎఫ్‌సి, డాక్టర్ రెడ్డీస్, ఐటిసి లిమిటెడ్, టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా, ఎస్‌బీలు నష్టాల్లో ముగిసాయి. గీతాంజలి జమ్స్ షేర్ల అమ్మకాల ఒత్తిడి ఈరోజు కూడా కొనసాగింది. మొత్తం మీద దేశీయ మార్కెట్లు నష్టాలతోనే ముగిసాయి.