బిజినెస్

పుంజుకోనున్న ఉద్యోగ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16 : భారతీయ ఉద్యోగ మార్కెట్ పనితీరు, ఈ ఏడాది మరింత ప్రోత్సాహజనకంగా ఉండబోతున్నది. దేశంలోని దాదాపు 60 శాతం కంపెనీలు ఈ ఏడాది నియామకాలను చేపట్టబోతున్నాయని ఒక సర్వే నివేదిక వెల్లడించింది. ‘‘హైరింగ్ ప్యాటర్న్ అండ్ కంపెనే్సషన్ అనాలిసిస్ ఇన్ 2018’’ పేరుతో విజ్‌డమ్ జాబ్స్.కామ్ ఒక సర్వే నిర్వహించింది. నోట్లరద్దు, హెచ్-1బి వీసా నిబంధనలు, జీఎస్టీ వల్ల ఉత్పన్నమైన సమస్యలు క్రమంగా తొలిగిపోయిన నేపథ్యంలో, నియామకాలు చేపట్టడానికి దేశంలోని వివిధ కంపెనీలు ఉద్యుక్తమవుతున్నాయని సర్వే తెలియజేసింది. జూనియర్, మిడిల్ స్థాయి పోస్టులకు చెల్లించే మొత్తాలు పెరిగే అవకాశముందని నివేదిక పేర్కొంది. స్టార్టప్‌లనుంచి ఎదురవుతున్న పోటీనుంచి ఎదుర్కొనేందుకే ఈ నియామకాలు చేపడుతున్నట్లు 30 శాతం కంపెనీలు తెలిపాయి. ఐటీ, ఇతర సాంకేతిక రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిగే అవకాశమున్నదని విజ్‌డమ్‌జాబ్స్.కామ్ పేర్కొంది.
2017లో తయారీ, ఐటీ, రవాణా, హాస్పిటాలిటీ రంగాల్లో పడిపోయిన నియామకాలు మళ్లీ పుంజుకునే అవకాశముంది. కాగా 2017లో వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో నియామకాలు ప్రోత్సాకరంగా జరిగాయి. ఇదే పోకడ 2018లో కూడా కొనసాగుతుందని సర్వే అంచనా వేసింది.
విజ్‌డమ్‌జాబ్స్.కామ్ మొత్తం 140 కంపెనీలు, 10 రంగాల్లో నియామకాలు చేపడుతున్న 350 మంది రిక్రూటర్లను సంస్థ సర్వే చేసింది. హైదరాబాద్, చెన్నై, పూణె, ఢిల్లీ, కోల్‌కతా, అహమ్మదాబాద్‌ల్లో ఈ సర్వే నిర్వహించారు.