బిజినెస్

ఇక టెక్స్‌టైల్ క్లస్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వస్త్ర పరిశ్రమ యజమానులు సొంత రాష్టమ్రైన తెలంగాణకు తిరిగి రావాలని టిఎస్-ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. శనివారం చైర్మన్ బాలమల్లు వలస వెళ్ళిన సూరత్ వస్త్ర (పవర్‌లూమ్) పరిశ్రమల యజమానులతో చర్చించారు. వస్త్ర పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి 200 ఎకరాల స్థలం ఇప్పించాలని వారు వినతి పత్రం సమర్పించారు. సూరత్‌కు వలస వెళ్ళిన తాము 550 మంది సభ్యులతో ఇక్కడ వీరభద్ర స్వామి టెక్స్‌టైల్స్ మ్యానుఫాక్ష్చరర్స్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నామని, మాడిఫైడ్ కాంప్రెన్సివ్ పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీం కింద టెక్స్‌టైల్స్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి, స్పెషల్ ప్యాకేజీ ఇప్పించేలా చూడాలని వారు చైర్మన్‌ను కోరారు. అందుకు చైర్మన్ బాలమల్లు సానుకూలంగా స్పందించారు.