బిజినెస్

జ్యుడీషియల్ కస్టడీకి 11మంది నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 17: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను వందల కోట్లలో మోసగించిన కేసులో 11 మంది నిందితులను ఈ నెల 28వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీ నియంత్రణలోని సంస్థలు పీఎన్‌బీ నుంచి ఆ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులతో కుమ్మక్కయి, మోసపూరితంగా రూ. 13వేల కోట్లకు పైగా విలువయిన ఎల్‌ఓయూలు (లెటర్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్), ఎల్‌సీలు (లెటర్స్ ఆఫ్ క్రెడిట్) పొందారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో కీలక నిందితులు గోకుల్‌నాథ్ శెట్టి (పీఎన్‌బీ మాజీ డిప్యూటి జనరల్ మేనేజర్), మనోజ్ ఖారత్ (పీఎన్‌బీ సింగిల్ విండో ఆపరేటర్), హేమంత్ భట్ (మోదీ కంపెనీ ఆథరైజ్డ్ సిగ్నేటరి), బెచ్చు తివారి (పీఎన్‌బీ ఫోరెక్స్ డిపార్ట్‌మెంట్ అప్పటి చీఫ్ మేనేజర్)లను సీబీఐ శనివారం ఇక్కడి ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్‌ఆర్ తంబోలి ఎదుట హాజరుపరిచింది. యశ్వంత్ జోషి (పీఎన్‌బీ ఫోరెక్స్ డిపార్ట్‌మెంట్‌లో స్కేల్ 2 మేనేజర్), ప్రఫుల్ సావంత్ (పీఎన్‌బీ ఎగుమతుల విభాగంలో స్కేల్ 1 అధికారి), మనీశ్ బోసామియా (మోదీకి చెందిన ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ మాజీ మేనేజర్), మితేన్ పాండ్యా (ఫైర్‌స్టార్ అప్పటి ఫైనాన్షియల్ మేనేజర్), సంజయ్ రాంభియా (ఫైర్‌స్టార్ ఆడిటర్), అనియత్ శివరామన్ నాయర్ (గీతాంజలి గ్రూపునకు చెందిన సంస్థ గిలి ఇండియా అప్పటి డైరెక్టర్), విపుల్ చితాలియా (గీతాంజలి గ్రూపు బ్యాంకింగ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్)లను కూడా శనివారం ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రత్యేక కోర్టు వీరందరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.