బిజినెస్

రెండోరోజు బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు బుధవారం పుంజుకున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెలువడనున్న తరుణంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ పుంజుకొని కీలకమయిన 33,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. విదేశీ ఫండ్‌ల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి నిరంతరంగా నిధులు తరలిరావడంతో పాటు స్పెక్యులేటర్లు షార్ట్ పొజిషన్లు తీసుకోవడంతో మార్కెట్‌లో ట్రేడింగ్ సెంటిమెంట్ బలపడింది. సెనె్సక్స్ 139 పాయింట్లు పెరిగి, 33,136.18 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకొని, 10,155.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. టెలికం షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని భారతి ఎయిర్‌టెల్ షేర్ల ధర అన్నింటికన్నా ఎక్కువగా పెరిగింది. బుధవారం ఉదయం పటిష్ఠమైన స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత మరింత పుంజుకొని ఇంట్రా-డేలో 33,354.93 పాయిం ట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 139.42 పాయింట్ల (0.42 శాతం) లాభంతో 33,136.18 పాయింట్ల వద్ద స్థిరపడింది. క్రితం సెషన్‌లో ఈ సూచీ 73.64 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ ఇంట్రా-డేలో 10,22 7.30 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో దిగజారి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 30.90 పాయింట్ల (0.31 శాతం) లాభంతో 10,155.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, మంగళవారం సెషన్‌లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 344.16 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 731.17 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
ముడి, శుద్ధి చేసిన చక్కెరపై ఇప్పటి వరకు 20 శాతం ఉన్న ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రద్దు చేయడంతో, చక్కెర కంపెనీల షేర్లు బుధవారం మార్కెట్‌లో మదుపరులను ఆకట్టుకున్నాయి. 2017-18 మార్కెటింగ్ సీజన్‌లో దేశంలో 29.5 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి కానున్న తరుణంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం దీనిపై ఎగుమతి సుంకాన్ని రద్దు చేసింది. బల్‌రాంపూర్ చిని షేర్ ధర 8.90 శాతం పెరగగా, ధంపూర్ సుగర్ షేర్ విలువ 0.90 శాతం పెరిగింది. కేసీపీ సుగర్ షేర్ విలువ 5.28 శాతం, గాయత్రి సుగర్ షేర్ ధర 2.54 శాతం చొప్పున పెరిగాయి. ఇటీవల ధరలు పడిపోయిన బ్యాం కింగ్ షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరు లు పూనుకోవడంతో వాటి ధరలు పెరిగాయి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ప్రధానంగా లాభపడ్డాయి. వీటి షేర్ల విలువ 1.24 శాతం వరకు పెరిగింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా 4.39 శాతం పుంజుకోగా, ఎన్‌టీపీసీ 2.11 లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. లాభపడిన సంస్థల్లో ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, ఎంఅండ్‌ఎం, రిల్, ఇన్ఫోసిస్, విప్రో, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, ఐటీసీ లిమిటెడ్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.14 శాతం పెరిగింది. రంగాల వారీ సూచీలలో టెలి కం సూచీ 2.36 శాతం పుంజుకుంది.