బిజినెస్

ఎపికార్ల్‌లో వ్యాక్సిన్ల తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూన్ 16: కడప జిల్లా పులివెందులలోని ఎపికార్ల్‌లో జినోమిక్స్ కంపెనీ మూడు రకాల వ్యాక్సిన్లు తయారు చేసిందని జినోమిక్స్ ఎండి రత్నగిరి పేర్కొన్నారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల ఎపికార్ల్‌లో ఆవు గర్భాశయంలో వచ్చే వ్యాధి, పాల పొదుపునకు సంబంధించి వ్యాధి, టిబికి వ్యాక్సిన్లను మొట్టమొదటిసారి తయారు చేశామన్నారు. దేశంలో మొట్టమొదటిసారి ఈ మందులను పులివెందుల ఎపికార్ల్‌లో మాత్రమే తయారుచేశామన్నారు. వీటిని తమిళనాడు రాష్ట్రం నుంచి ఆర్డర్ రావడంతో అక్కడికి సరఫరా చేస్తామన్నారు. గర్భాశయవ్యాధికి సంబంధించి ఎండోమెంట్-బి ప్రమోటిక్, పొదుగు వాపునకు సంబంధించి ఎబిటి ఛేంజ్, టిబి వ్యాధికి సంబంధించి టిబి అలర్ట్ మందులు ఉన్నాయన్నారు. మొదటి రకం రూ.200, రెండవ రకం రూ.150, మూడవ రకం రూ.50 విలువ చేస్తాయన్నారు. మరిన్ని వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్లు త్వరలో తయారుచేస్తామని వివరించారు. పులివెందుల ప్రాంతంలో ఈ వ్యాక్సిన్లను 50 శాతం రాయితీతో రైతులకు అందజేస్తామన్నారు. ఎపికార్ల్‌లో కౌంటర్ ఏర్పాటుచేసి ఈ మందులు విక్రయించనున్నట్లు తెలిపారు. ఎపికార్ల్ సిఇఓ బాషా మాట్లాడుతూ ఎపికార్ల్‌కు త్వరలో పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.7.50 లక్షలతో రోడ్లు, వంద సోలార్ లైట్లు, ఐదు చెక్‌డ్యామ్‌లు, పైపులైన్లు, పిబిసి నీటి కింద రూ.5 లక్షల పనులు జరిగాయన్నారు. జూలైలో గ్రీన్‌సెల్ కంపెనీ వస్తుందని, వారికి 30 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. గ్రీన్‌సెల్ తయారుచేసే ఎంజోమ్స్‌ను అమెరికాకు తరలిస్తామన్నారు. మిగితా దాణా ఇక్కడి పశువులకు ఉపయోగపడుతుందన్నారు. ఋషి విజ్ఞాన కేంద్రాన్ని ఇక్కడ స్థాపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. మరికొన్నిరోజుల్లో ఎపికార్ల్‌కు పూర్వ వైభవం రానుందని అన్నారు.

చిత్రం కడప జిల్లా పులివెందులలోని ఎపికార్ల్‌లో తయారైన వ్యాక్సిన్లను చూపుతున్న జినోమిక్స్ ఎండి రత్నగిరి