బిజినెస్

రిస్కులను గమనిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న ఐరోపా కూటమినుంచి బ్రిటీష్ నిష్క్రమణ (బ్రెక్సిట్)పై రెఫరెండం, మధ్యప్రాచ్యంలో కల్లోలం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిణామాలపై ప్రభుత్వం కనే్నసి ఉంచిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం చెప్పారు. తాము రొటీన్‌గా పరిశీలించే, చర్చించే అంశాలు చాలా ఉంటాయని, భారత్‌కు దేశీయంగా ఉన్న రిస్క్‌లతో పాటుగా చమురు ధరలు, మధ్యప్రాచ్యంలో పరిణామాలు, బ్రిటన్ రెఫరెండంలాంటి పలు అంశాలను తాము చర్చించామని ఇక్కడొక కార్యక్రమానికి హాజరయిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ సిన్హా చెప్పారు. ఐరోపా సమాజంలో కొనసాగాలా వద్దా అనే దానిపై ఈ నెల 23న బ్రిటన్‌లో రెఫరెండం జరగనున్న విషయం తెలిసిందే. బ్రిటన్‌తో పాటుగా ఐరోపా యూనియన్‌లోని అన్ని దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న మన దేశంపై ఈ రెఫరెండం ప్రనావం తప్పకుండా ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సంకేతాలను బట్టి ఫలితం ఎటయినా ఉండవచ్చనిపిస్తోందని సిన్హా చెప్పారు. ఇదిలా ఉండగా ఒక వేళ బ్రిటన్ గనుక యూరవపియన్ యూనియన్‌నుంచి వైదొలగినట్లయితే ఆర్థికపరంగా దాని ప్రభావం బ్రిటన్‌పై చాలా తీవ్రంగా ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ అభిప్రాయ పడ్డమే కాకుండా అది ఐరోపా సమాజంలోనే కొనసాగడం మంచిదని అభిప్రాయ పడింది. ఐరోపా సమాజం నుంచి బ్రిటన్ వైదొలగాలని వాదించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్రిటన్‌లో అత్యధిక పాఠకులున్న పత్రికల్లో ఒకటైన ఫైనాన్షియల్ టైమ్స్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం రెఫరెండంపై సైతం ప్రభావం చూపించవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అలాగే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇటీవలి కాలంలో బ్యారెల్ 40 డాలర్లకు పడిపోవడంతో దేశ అవసరాలకు చాలావరకు దిగుమతులపైనే ఆధారపడిన భారత్ గణనీయంగా లాభపడింది. అయితే ఈ మధ్య తిరిగి చమురు ధరలు పెరుగుతూ 50 డాలర్లకు చేరుకున్నాయి. ఒక వేళ చమురు ధరలు బ్యారెల్ 40-60 డాలర్ల మధ్య ఉంటే ఫరవాలేదని, అంతకన్నా దాటిపోతేనే సమస్య అవుతుందని సిన్హా అన్నారు.

చిత్రం న్యూఢిల్లీలో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జయంత్ సిన్హా, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా, సిబిఇసి చైర్మన్ నజీబ్ షా