బిజినెస్

రూ. 40 వేల కోట్లతో విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రానున్న మూడేళ్లలో విద్యుదుత్పత్తిని చేయనున్నట్లు జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని దిగువ జూరాల సిబ్బందికి కొత్తగా నిర్మించిన భవన సముదాయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఆత్మకూర్ పట్టణానికి సమీపంలో 14.30 కోట్ల రూపాయల నిధులతో జెన్‌కో సిబ్బందికి భవన సముదాయాన్ని నిర్మించారు. అనంతరం దిగువ జూరాల వద్ద జరుగుతున్న విద్యుదుత్పత్తి పనులను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగువ జూరాల వద్ద చేపట్టిన ఆరు విద్యుత్ యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్‌ను జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా, గత సంవత్సరం వరదల ఉధృతికి పనులు ఆలస్యమైనట్లు ఆయన తెలిపారు. దాదాపు 1,200 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన దిగువ జూరాల విద్యుదుత్పత్తి పనులు పూర్తయిన పక్షంలో జిల్లాకు విద్యుత్ కొరత తీరనుందని ఆయన పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయల తో చేపట్టనున్న 5,880 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన పక్షంలో రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా పక్క రాష్ట్రాలకు విద్యుత్‌ను విక్రయించే స్థాయికి ఎదుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో ఎఇ శ్రీ్ధర్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిత్రం కొత్త భవనం ప్రారంభ దృశ్యం