బిజినెస్

40 శాతం సామర్థ్యం పడిపోయిన సౌరవిద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 16: గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం చేర్చాలనుకున్న అదనపు సౌరవిద్యుత్ సామర్థ్యం 40 శాతం తగ్గిపోయే అవకాశముంది. గత 12-15 నెలల కాలంలో టెండర్లు ఇతర ప్రక్రియల్లో చోటుచేసుకుంటున్న విపరీత జాప్యమే ఇందుకు కారణమని ఒక నివేదిక వెల్లడించింది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తికి, జోడించాలనుకున్న సౌరవిద్యుత్ 40 శాతం తగ్గిపోయిందని, ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా వెల్లడించింది. 2017 నుంచి టెండర్ విధానంలో కొనసాగుతున్న తీవ్ర జాప్యమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల ఏటా సౌరవిద్యుత్ జోడింపు తగ్గిపోతున్నది. ఉదాహరణకు 2016లో 7,300 మెగావాట్ల సౌరవిద్యుత్ కు అనుమతి లభించగా, 2017లో అది 4,500 మెగావాట్లకు పడిపోయిందని ఇక్రా పేర్కొంది. ఇటీవలికాలంలో సోలార్ ప్రాజెక్టుల బిడ్డింగ్‌లకు సంబంధించి ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసిం ది. దిగుమతి సుంకంపై ఈ నిబంధనలు మరింత స్పష్టతనివ్వడంతో, సౌరవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేవారికి ఎంతో ప్రజయోజనం చేకూరింది. ఏటా సౌరవిద్యుత్ బిడ్ టారిఫ్ స్థాయిలు ఏటా తగ్గిపోతూ వస్తుండటం వివిధ రాష్ట్రాల డిస్కమ్‌లకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా 2016లో సౌరవిద్యుత్ యూనిట్‌కు రూ.5లు కోట్ చేయగా, 2017లో ఇది రూ.3లకు పడిపోయింది.