బిజినెస్

డబుల్ బెడ్‌రూమ్ పథకానికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: డబుల్ బెడ్‌రూమ్ పథకానికి సహకరించాలని స్టీల్ ఉత్పత్తిదారులను గృహ నిర్మణ శాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామ చంద్రన్ కోరారు. మంగళవారం గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, గునుల శాఖ సంచాలకులు సుశీల్‌కుమార్‌లతో పాటు స్టీల్ ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం సక్రమంగా సాగేందుకు స్టీల్ ఉత్పత్తిదారులు గతంలో నిర్ణయించిన ధరలకు సకాలంలో స్టీల్‌ను అందించాలన్నారు. సకాలంలో స్టీల్ అందక పోవడంతో గృహ నిర్మాణాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా ఉత్పత్తి చేసి అందించేందుకు జిల్లాల వారీగా గృహ నిర్మాణ నోడల్ అధికారి, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టీల్ ఉత్పత్తిదారులు ఏప్రిల్ 15 వరకు అందిన ఇండెట్ల ప్రకారం పాత ధరల ప్రకారమే స్టీలు సరఫరా చేయాలని కోరారు. కాగా మార్కెట్ ధరను అనుసరించి సరఫరా రేట్లను సవరించాలని స్టీలు ఉత్పత్తిదారులు కోరగా త్వరలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు వారికి తెలిపారు.