బిజినెస్

ఆర్‌బిఐ గవర్నర్ రేసు అరుంధతీ భట్టాచార్య ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రేసులో ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ముందంజలో ఉన్నారు. గవర్నర్‌గా ఈ సెప్టెంబర్ 4న రఘురామ్ రాజన్ పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త గవర్నర్ రేసులో పలువురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ భట్టాచార్యతోపాటు ఆర్‌బిఐ మాజీ డిప్యూటి గవర్నర్ సుబిర్ గోకర్ణ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌లోనే ఎస్‌బిఐ చైర్‌పర్సన్‌గా భట్టాచార్య పదవీకాలం ముగుస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగానికి చెందిన భట్టాచార్యకే అత్యున్నత బ్యాంక్ అధిపతి అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం.
ఇకపోతే కొత్త గవర్నర్ రేసులో.. ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్ ఊర్జిత్ పటేల్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్, ఆర్థిక ముఖ్య సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్, ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు, ఆర్థిక మంత్రి మాజీ సలహాదారు పార్థసారథి షోమ్, బ్రిక్స్ బ్యాంక్ అధిపతి కెవి కామత్, సెబీ చైర్మన్ యుకె సిన్హా, ఆర్‌బిఐ మాజీ డిప్యూటి గవర్నర్ రాకేశ్ మోహన్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్, సిసిఐ మాజీ చైర్మన్ అశోక్ చావ్లా, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రీ, ప్రముఖ ఆర్థికవేత్త ఆర్ వైద్యనాథన్ పేర్లు వినిపిస్తున్నాయ. కాగా, ‘సరైన సమయంలో ఆర్‌బిఐ నూతన గవర్నర్ ఎవరన్నది ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంతవరకు అనవసరపు ఊహాగానాలకు తెరలేపదల్చుకోలేదు.’ అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఓ ఆర్‌బిఐ గవర్నర్ పదవీకాలం పొడిగింపుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, అది తీవ్ర చర్చనియాంశంగా మారిన పరిస్థితుల్లో రాజన్ గత శనివారం తాను రెండోసారి గవర్నర్‌గా ఉండబోనని ప్రకటించినది తెలిసిందే.
2013 సెప్టెంబర్ 4న కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యుపిఎ ప్రభుత్వం రాజన్‌ను ఆర్‌బిఐ గవర్నర్‌గా నియమించినది తెలిసిందే. రాజన్ కంటే ముందు 1992 నుంచి గమనిస్తే ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన వారంతా కూడా వరుసగా రెండుసార్లు ఆ పదవిలో కొనసాగారు. సి రంగరాజన్ (1992-97), బిమల్ జలాన్ (1997-2003), వైవి రెడ్డి (2003-08), దువ్వూరి సుబ్బారావు (2008-13) తొలుత మూడేళ్లు, ఆ తర్వాత రెండేళ్ల చొప్పున మొత్తం ఐదేళ్లపాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగారు. కానీ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజన్ మాత్రం మూడేళ్లకే పరిమితమవుతున్నారు. దీనిపై రాజకీయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నది తెలిసిందే.