బిజినెస్

విధానాలేగాని వ్యక్తులు ముఖ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెళ్లిపోతున్న క్రమంలో వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య విధానాలపైనేగానీ, వ్యక్తులపై ఆధారపడి రేటింగ్ చర్యలుండవని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ వ్యాఖ్యానించింది. ఈ సెప్టెంబర్ 4న మూడేళ్ల పదవీకాలం ముగుస్తున్న క్రమంలో రెండోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉండలేనంటూ గత శనివారం రాజన్ ప్రకటించినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్ సేవలు అవసరమన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నది తెలిసిందే. అయితే విధానాలు బాగుండాలని, అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపథంలో దూసుకెళ్తుందని, రేటింగ్ కూడా మెరుగవుతుందని, అంతేగాని ఎవరో ఉన్నారని ఇదంతా జరగదని సోమవారం ఇక్కడ ఫిఛ్ ఆసియా-పసిఫిక్ సావరిన్స్ గ్రూప్ డైరెక్టర్ థామస్ రూక్‌మాకర్ అన్నారు.
కృష్ణపట్నం పోర్టులో
మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు
ముత్తుకూరు, జూన్ 20: కృష్ణపట్నం పోర్టు బైపాస్ రోడ్డు మార్గంలో పంటపాళెం గ్రామ సమీపాన స్థానిక రైల్వే శాఖ పర్యవేక్షణలో నిర్మాణం కానున్న మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు నిర్మాణానికి సోమవారం రాత్రి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఇక్కడ రైల్వే శాఖాధికారులు భూమి పూజ శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. భూమి పూజకు సంబంధించిన దృశ్యాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో ప్రదర్శించారు. కంటైనర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌వారు ఈ పార్కు నిర్మాణ పనులను చేపట్టనుండగా, స్థానికులకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. రైల్వే ఉన్నతాధికారులు వివరాలను విలేఖరులకు తెలిపారు.
పార్కు శిలాఫలకం ఆవిష్కరణ

హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కి
చేతినిండా పని
2018 నాటికి రూ. 20 వేల కోట్ల ఆర్డర్లు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 20: ఆర్డర్లు లేక నిర్వహణ సైతం కష్టంగా మారిన విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్)కి చేతి నిండా పని దొరకబోతోంది. 2018 చివరి నాటికి హెచ్‌ఎస్‌ఎల్ 20 వేల కోట్ల రూపాయల ఆర్డర్లను సొంత చేసుకోనుంది. రక్షణ శాఖ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత హెచ్‌ఎస్‌ఎల్‌కు కొంతమేర ఆర్థిక ఉపశమనం లభించింది. ప్రైవేటు పోటీని తట్టుకుని, నిలదొక్కుకునే క్రమంలో హెచ్‌ఎస్‌ఎల్‌కు భారీ ఆర్డర్లు కొత్త ఊపిరినిస్తాయనే చెప్పాలి. భారత నౌకాదళానికి అవసరమైన ఐదు ఫ్లీట్ సపోర్ట్ వెసల్స్ (ఎఫ్‌ఎస్‌వి) నిర్మాణానికి హెచ్‌ఎస్‌ఎల్ సిద్ధంగా ఉంది. వీటి విలువ సుమారు 10 వేల కోట్ల రూపాయలు.
అలాగే 5 వేల కోట్ల రూపాయలతో, రెండు ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్స్ (ఎల్‌పిడి), 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలతో మరో రెండు సబ్‌మెరైన్‌ల నిర్మాణానికి గాను హెచ్‌ఎస్‌ఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ సుమారు 20 వేల కోట్ల రూపాయలు. 2017 చివర లేదా 2018 ప్రారంభంలో వీటికి సంబంధించి ఒప్పందాలు జరగనున్నాయి. మరోవైపు తీవ్ర నష్టాల్లో నడుస్తున్న హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16)లో 20 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. సంస్థ సిఎండి ఎల్‌వి శరత్‌బాబు సోమవారం విలేఖరులకు తెలిపారు. గడచిన మూడున్నర దశాబ్దాల్లో హెచ్‌ఎస్‌ఎల్ రెండు, మూడు సందర్భాల్లో మినహా ఇంత భారీ లాభాలను ఆర్జించడం ఇదే ప్రథమం. హెచ్‌ఎస్‌ఎల్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.