బిజినెస్

జీఎస్‌టీ పన్నుల వసూలుకు వాణిజ్య శాఖలో పూర్తి స్థాయి ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఈ ఏడాది రూ. 64,539 కోట్ల పన్నులను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదిపైన 31.86 శాతం వృద్ధిరేటు సాధించాలని నిర్ణయించింది. 2017-18లో వస్తు సేవా పన్ను అమలైన తర్వాత రూ. 48,944 కోట్ల పన్నులను వసూలు చేసింది.
వాణిజ్యపన్నులు, ఎక్సైజ్ శాఖ కలిపి అంతకు ముందు ఏడాది కంటే 20.02 శాతం వృద్ధిరేటుతో పన్నులను వసూలు చేశారు. దేశ వ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీ నుంచి జిఎస్‌టి చట్టం అమలైంది. జిఎస్‌టిపై వర్తకుల్లో అవగాహన పెంచేందుకు 1700 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రాంతాల వారీగా, రంగాల వారీగా వర్తకులతో సంప్రదింపులు జరిపారు. వినియోగదారులకు అవగాహన సదస్సులను నిర్వహించారు. వివిధ శాఖల మధ్య సమావేశాలను నిర్వహించారు. ఇతర శాఖల అధికారులకు పునశ్చరణ తరగతులను నిర్వహించారు. అన్ని డివిజన్లలో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిపార్టుమెంట్‌కు చెందిన సిబ్బంది ప్రతి ఒక్కరి చేత సుమారు 200 డీలర్లకు వ్యక్తిగత మద్దతు అందే విధంగా అఫిషియల్ ఇన్‌చార్జి అనే విధానాన్ని వాణిజ్య పన్నుల శాఖ ప్రవేశపెట్టింది. పన్నుల పరిధిని విస్తరించేందుకు వాణిజ్యపన్నుల శాఖ స్ట్రీట్ సర్వేను నిర్వహించింది. ఈ చర్యల వల్ల 40 శాతం పన్నుల వసూళ్లు పెరిగాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.2 లక్షల నుంచి 3.05 లక్షలకు పెరిగింది.
రాష్ట్రంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు, పన్నుల చెల్లింపును సరళీకృతం చేసేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకును మెరుగుపరిచేందుకు వాణిజ్య పన్నుల శాఖ భారీ ఎత్తున సంస్కరణలను చేపట్టింది. మోసపూరిత లావాదేవీలకు పాల్పడేందుకు అవకాశం ఉన్న డీలర్లను గుర్తించేందుకు ఆర్థిక ఇంటెలిజెన్స్‌ను బలోపేతం చేశారు. పన్ను ఎగవేతకు పాల్పడిన తర్వాత గుర్తించేందుకు ప్రయత్నం చేసే బదులు అంతకు ముందే వీరిని గుర్తించే ప్రక్రియను చేపట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను బలోపేతం చేశారు.
సమాచార సాంకేతిక వౌలిక సదుపాయాలను పటిష్టం చేశారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు లీగల్ మెట్రాలజీతో సమన్వయంతో వాణిజ్య పన్నుల శాఖ పనిచేస్తోంది. పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించారు. జీఎస్‌టీ ప్రకటనతో వస్తు సేవలు సాఫీగా జరిగేందుకు అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను రద్దు చేశారు. జాతీయ ఈ -వేబిల్ త్వరలో అమలులోకి రాబోతుంది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా వస్తువుల రవాణాకు కేవలం ఒక్క ఈ-వేబిల్ ఉంటే సరిపోతుంది. పన్ను చెల్లింపుదార్ల సమస్యలను పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్, హెల్ప్‌లైన్‌ను వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖను 12 పరిపాలన విభాగాలుగా విభజించారు.
ప్రతి విభాగానికి డిప్యూటీ కమిషనర్ నేతృత్వం వహిస్తారు. మొత్తం 3617 పోస్టుల్లో 896 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, మానవవనరులను సద్వినియోగం చేసుకుని పన్ను ఆదాయం వృద్ధి చేయడంలో వాణిజ్య పన్నుల శాఖ ముందంజలో ఉంది.