బిజినెస్

ఫార్చూన్ జాబితాలో.. ముఖేశ్ అంబానీ, ఇందిరా జైసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: భారత్‌లో అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ, ప్రముఖ మానవహక్కుల న్యాయవాది ఇందిరా జైసింగ్‌లను 2018 సంవత్సరానికి ప్రపంచంలో గొప్ప నాయకులుగా ఫార్చూన్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రపంచంలో మొత్తం 50 మంది గొప్ప నాయకుల జాబితాను ఫార్చూన్ మ్యాగజైన్ గురువారం విడుదల చేసింది. ప్రముఖ వాస్తుశిల్పి బాలకృష్ణ దోషి, యాపిల్ సీఈఓ టిమ్ కూక్, న్యూజిలాండ్ ప్రధాని జసింద ఆర్డెర్న్, ఫూట్‌బాల్ కోచ్ నిక్ సబాన్‌లు కూడా ఇందులో ఉన్నారు. జియోను స్థాపించిన రెండేళ్ల కాలంలో మొబైల్ డేటాను ప్రజల్లోకి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అని ఫార్చ్యూన్ పేర్కొంది. గురువారం 61వ వసంతంలోకి ప్రవేశించిన ముఖేశ్ అంబానిని జాబితాలో 24వ స్థానం కల్పించింది. ఈయనకు ముందు దక్షిణాసియా అధ్యక్షుడు మోన్ జాయ్-ఇన్, చైనా వైస్ ప్రీమియర్ లియో హీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మక్రాన్ ఉన్నారు.
47 బిలియన్ యుఎస్ డాలర్ల విలువైన రిలయన్స్ సామ్రాజ్యానికి అధినేత ముఖేశ్ అంబాని, 2016 సెప్టెంబర్ నెలలో జియో మొబైల్ నెట్‌వర్క్‌ను స్థాపించి, 168 మిలియన్ల మం ది సబ్‌స్క్రైబర్లను సంపాదించారు. దీనివల్ల నెలకు 1100 శాతం నెలసరి డేటా వినియోగం భారత్‌లో పెరిగిందని ఫార్చూన్ పేర్కొంది. ఇక లాయ ర్స్ కలెక్టివ్ జైసింగ్ తమ జీవితాన్ని అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికే ఉద్దేశించారని మ్యాగజీన్ పేర్కొంది. 3దేశంలోని నిరుపేదలు తమ వాణిని వినిపించాలంటే, అందు కు వారికున్న మార్గం జైసింగ్ మాత్ర మే2 అని వివరించింది. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మృతుల తరపున పోరాటం సాగించారు. భారత్‌లోని సిరియాకు చెందిన క్రైస్తవ మహిళలు తమ భర్తలతోపాటు సమానంగా ఆస్తిలో వాటా సంపాదించేవరకు పోరాటం కొనసాగించారు. ఇం తటి నేపథ్యమున్న ఆమెకు ఫార్చూన్ 20వ స్థానానికి ఎంపిక చేసింది.