బిజినెస్

ఎపి డెయిరీ పాల ధర తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 21: ఓ పక్క పాల సేకరణ నిలిపివేసిన అధికారులు.. మరోపక్క పాల ధర తగ్గించి పాడి రైతుల నోట్లో మట్టికొట్టారు. ఎపి డెయిరీల నుంచి పాలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఇటీవల అధికారులు పాల సేకరణ తగ్గించారు. తాజాగా ధరలు కూడా తగ్గించారు. పైగా ఈనెల 16 నుంచే కొత్త ధరలు వర్తిస్తాయని అనంతపురం జిల్లా హిందూపురంలోని పాలశీతలీకరణ కేంద్రంలో నోటీసులు అతికించడంతో రైతులు మండిపడుతున్నారు. గతంలో లీటర్ ఆవు పాల ధర రూ. 26 రూ. 27 వరకు ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ. 15 నుంచి రూ. 18కు తగ్గించారు. అలాగే గేదె పాల ధర రూ. 45, రూ. 50 మధ్య ఉంటే రూ. 32కు తగ్గించారు.