బిజినెస్

నల్లధనం వెల్లడి పథకాన్ని జయప్రదం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: దేశీయంగా నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువును ఎక్కువమంది ఉపయోగించుకునేలా చేయడం ద్వారా దాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదాయం పన్ను శాఖ తన ఆధికారులను కోరింది. ఈ పథకం కింద వెల్లడించే వివరాలను రహస్యంగా ఉంచుతామని, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వివరాలు వెల్లడించడానికి సహకరిస్తామని నల్లధనం కలిగిన వారికి హామీ ఇవ్వడం ద్వారా, అలాగే ఈ గడువుగురించి విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఈ పథకాన్ని విజయవంతం చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) అధికారులకు సూచించింది. నల్లధనం కలిగి ఉండే అవకాశాలుండే సంపన్నులు తరచూ సందర్శించే క్లబ్ హౌస్‌లు, పోష్ మార్కెట్లు, విలువైన ఉత్పత్తుల షోరూమ్‌లులాంటి వాటి వద్ద పోస్టర్లు అతికించడం లాంటి చర్యల ద్వారా ఆదాయం వెల్లడి పథకం-2016కు విస్తృత ప్రచారం కల్పించాలని సిబిడిటి సూచించింది. సిబిడిటి రూపొందించిన చతుర్ముఖ వ్యూహం కింద వివరాలు రహస్యంగా ఉంచడం కోసం సింగిల్ పాయింట్ కాంటాక్ట్, దేవవ్యాప్తంగా ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, విస్తృతమైన ప్రచారం ఇవ్వడం, అత్యున్నత స్థాయిలో పర్యవేక్షణ ఉన్నాయి. దేశంలో నల్లధనం కలిగి ఉన్న వారు స్వచ్ఛందంగా వాటి వివరాలు వెల్లడించడానికి ఆదాయం వెల్లడి పథకం-2016 కింద ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో నాలుగు నెలలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1నుంచి ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబర్ చివరి వరకు అమలులో ఉంటుంది.