బిజినెస్

విమానాల తయారీలో సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 10: దేశీయంగా పౌర, రక్షణ రంగ అవసరాలకు ఉపయోగపడే విధంగా విమానాలను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాలని పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు అమెరికాను కోరారు. గురువారం ఇక్కడ భారత్-అమెరికా ఆరవ విమానయాన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విమానయాన రంగానికి సంబంధించిన టెక్నాలజీలో అమెరికా ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసే స్థితిలో ఉందని ప్రశంసించారు. దేశీయంగా భారత్ ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారు చేసేందుకు అమెరికా సహకరించాలన్నారు. దీని వల్ల భారత్‌లో అమెరికా వాణిజ్య అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతాయన్నారు. అమెరికా భాగస్వామ్యంతో విమానాలే కాకుండా ద్రోన్ల తయారీ పట్ల కూడా భారత్ ఆసక్తిగా ఉందన్నారు. దేశీయంగా ద్రోన్లను తయారు చేసేందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ సిఫార్సులు వచ్చిన తర్వాత ప్రణాళికను రూపొందిస్తామన్నారు. అమెరికా రాయబారి కెనె్నత్ జస్టర్ మాట్లాడుతూ, విమానయాన రంగంతో పాటు అనేక రంగాల్లో భారత్-అమెరికాలు ఉమ్మడిగా పరిశోధనలు చేసి అభివృద్ధిని నమోదు చేసినట్లు చెప్పారు. భారత్-అమెరికా విమానయాన రంగంపై ఏర్పాటు చేసిన కమిటీలో పదేళ్ల క్రితం పది మంది సభ్యులు ఉంటే, ఇప్పుడు 30 మంది ఉన్నారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో సంస్కరణలు సంపూర్ణ స్థాయిలో అమలైతే అమెరికాకు చెందిన అనేక కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు, టెక్నాలజీని పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వస్తాయన్నారు. అమెరికా వాణిజ్య, అభివృద్ధి ఏజన్సీ నిపుణులు థామస్ హార్డీ మాట్లాడుతూ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నామన్నారు. పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే మాట్లాడుతూ, విమాన యాన రంగంలో ప్రపంచంలోని వివిధ దేశాలతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్‌కు అనుబంధంగా ఒక కనె్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. ఎయిర్ ట్రాఫిక్ మేనేజిమెంట్, అభివృద్ధి, భద్రత అంశాలపై అమెరికాతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు.