బిజినెస్

సింగరేణిలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 11: సింగరేణి యాజమాన్యం సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు చేపడుతోందని సింగరేణి చైర్మ న్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. తొలి దశలో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రూ. 1360 కోట్ల అంచనా వ్యయం తో ముందుకు సాగుతున్నట్లు శుక్రవారం హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించినట్లు ప్రకటించారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి యాజమాన్యం సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. తొలి దశలో 9 చో ట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇల్లందు ఏరియాలో 60 మెగావాట్లు, మంద్రమర్రిలో 60 మెగావా ట్లు, రామగుండం 1లో 50, రామగుండం 2లో 25 మెగావాట్లు, మణుగూరు ఏరియా లో 30 మెగావాట్లు, బెల్లంపల్లిలో 30, కొత్తగూడెంలో 25, భూపాలపల్లిలో 10 మెగావాట్ల విద్యుత్‌తోపాటు సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో సైతం 10 మెగావాట్ల సోలార్ వి ద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాల కోసం వి ద్యుత్ అందించేందుకు సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు చైర్మన్ ప్రకటించారు. మణుగూరు 2 ఓపెన్‌కాస్ట్ విస్తరణకు అనుమతులు ఇచ్చేందుకు బోర్డు ఆ మోదం తెలిపింది. సింగరేణి సంస్థలో వివిధ గనుల్లో అవసరమైన భారీ యంత్రాల కొనుగోలుకు బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (పా) పవిత్రన్ కు మార్, డైరెక్టర్ ఇ అండ్ ఎం శంకర్, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ డైరెక్టర్ భాస్కర్‌రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, కేంద్ర బొగ్గు గనుల శాఖ డైరెక్టర్ షహీద్ ఆప్రష్, ఇంధన కార్యద ర్శి అజయ్ మిశ్రా, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ చైర్మన్ ఆర్ ఆర్ మిశ్రా, సింగరేణి కంపెనీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.