బిజినెస్

బలపడిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఉత్సాహపూరిత వాతావరణం దన్నుగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బాగా బలపడ్డాయి. కీలక సూచీలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఒక్క సెషన్‌లోనే 290 పాయింట్లు పెరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మళ్లీ కీలకమయిన 10,800 పాయింట్ల పైన ముగిసింది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనా వేసినదానికన్నా తక్కువగా నమోదు కావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందేమోనన్న భయాందోళనలు తగ్గిపోయాయి. దీంతో అమెరికా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడి మదుపరులు ఉత్సాహంగా కొనుగోళ్లకు పూనుకున్నారు. ఈ సానుకూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ఉదయం నుంచే ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. సెనె్సక్స్ సెషన్ అంతా సానుకూల ధోరణిలోనే కొనసాగింది. ఇంట్రా-డేలో ఒక దశలో 35,596.15 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 289.52 పాయింట్ల (0.82 శాతం) పైన 35,535.79 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇంట్రా-డేలో 10,812.05 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 89.95 పాయింట్ల (0.84 శాతం) పైన 10,806.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు సూచీలు కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత తమ గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, ఈ వారంలో సెనె్సక్స్ 620.41 పాయింట్లు (1.78 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 188.25 పాయింట్లు (1.77 శాతం) పెరిగింది. గత అయిదు వారాల్లో ఈ సూచీలు ఇంత ఎక్కువగా పుంజుకోవడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా, గురువారంనాటి లావాదేవీలలో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 900.69 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 364.88 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఆసియన్ పెయింట్స్ షేర్ ధర అత్యధికంగా 6.17 శాతం పెరిగింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఆసియన్ పెయింట్స్ తన నికర లాభాన్ని 3.39 శాతం పెరుగుదలతో రూ. 495.91 కోట్లకు పెంచుకోవడంతో ఆ కంపెనీ షేర్ విలువ శుక్రవారం బాగా పెరిగింది. షేర్ల విలువ పెంచుకున్న ఇతర సంస్థల్లో టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, కోటక్ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, రిల్, విప్రో ఉన్నాయి. మరోవైపు, టెలికం షేర్లు శుక్రవారం బాగా నష్టపోయాయి. రిలయన్స్ జియో గురువారం కొత్త పోస్ట్- పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించిన మరుసటి రోజే టెలికం షేర్లు నష్టపోయాయి. భారతి ఎయిర్‌టెల్ షేర్ ధర 6.44, ఐడియా సెల్యులార్ షేర్ విలువ 11.83 శాతం చొప్పున పడిపోయాయి. టాటా టెలీసర్వీసెస్, రిలయన్స్ కమ్యూనికేష న్స్, ఎంటీఎన్‌ఎల్ షేర్ల ధర కూడా పడిపోయిం ది. నష్టపోయిన ఇతర సంస్థల్లో సన్ ఫార్మా, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ ఉన్నాయి.