బిజినెస్

మళ్లీ పెట్రో మోత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 17: పెట్రోధరలను పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలో పరిశీలిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ లీటర్‌కు రూ.4 చొప్పున పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు పెట్రో సంస్థల వర్గాలు తెలిపాయి. దీని వల్ల వినియోగదారులపై పెను భారం పడనుంది. కర్నాటకలో పోలింగ్ ముగిసిన మర్నాటి నుంచి కేంద్ర చమురు సంస్థలు రోజూవారీ పెట్రో ధరలను సమీక్షిస్తున్నాయి. అంతకు ముందు 19 రోజుల పాటు కర్నాటక ఎన్నికల దృష్ట్యా చమురు ధరలను సమీక్షించలేదు. గత వారం రోజుల్లో పెట్రోలు ధర లీటర్‌కు 69 పైసలు పెరిగింది. తాజాగా 22పైసలు పెంచడంతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ. 75.32 పైసలకు చేరింది. గత ఐదేళ్లలో ఇంత స్థాయిలో పెట్రోలు ధర పెరగలేదు. డీజిల్ ధర కూడా గత వారం రోజుల్లో లీటర్‌పైన 86 పైసలు పెరిగింది. తాజాగా ఈ రోజు లీటర్‌కు 22పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ డీజిల్‌ను రూ. 66.79కు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 వరకు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. గత పక్షం రోజులోల అంతర్జాతీయంగా అనేక మార్పులు వచ్చాయి. కర్నాటక ఎన్నికల వల్ల చమురు ధరలను సమీక్షించలేదు. దీని వల్ల ఒక్కసారిగా పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగాయి.