బిజినెస్

జూన్ నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణాలో మిగులు విద్యుత్ సాధించడానికి చేపడుతున్న చర్యలతో సత్ఫలితాలు ఇచ్చాయని, దీంతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న విద్యుత్ ప్లాంట్ల నుంచి జూన్ నెలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు జెన్కో, ట్రాన్సికో సిఎండి ప్రభాకరరావు స్పష్టం చేశారు. విభజన తర్వాత తెలంగాణాలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగడంతో ముందస్తుగా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. శుక్రవారం విద్యుత్ సౌదాలో సిఎండి ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులతో సమీక్షించారు. మరో రెండేళ్ళలో అదనంగా 3480 మెగావాట్ల విద్యుత్, ఆ తర్వాత రెండేళ్ళలో మరో 4000వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. రామగుండంలో ఎన్టీపిసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్ పురోగతిపై ఆయన చర్చించారు. అక్కడ 4000 వేల మెగావాట్ల విద్యుత్ కోసం ప్లాంట్ నిర్మాణాలు జరుగుతున్నాయని, మొదటి దశలో 1600 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైయ్యిందని చెప్పారు.ఎన్‌టిపిసిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని అక్కడి ఇడి దూబె తెలిపారు. వచ్చే ఏడాదిలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందన్నారు. కేటిపిఎస్ 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు పూర్తి చేశామన్నారు. భద్రాద్రి ప్లాంట్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుత్ కోసం నాలుగు యూనిట్లు నిర్మాణం ప్రారంభించామన్నారు. ఎన్టీపిసి, భద్రాద్రి, కేటీపిఎస్ ద్వారా 2020 మార్చి నాటికి 3480 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబటులోకి వస్తుందన్నారు.