బిజినెస్

ఏపీలో పెట్టుబడులకు వాల్‌మార్ట్ ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో వాల్‌మార్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దీని ద్వారా ఏపీలోని 15వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడలు పెట్టాలని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ ‘డిజటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకోవడానికి ఢిల్లీకి వచ్చిన లోకేష్ యూస్, ఇండియా బిజినెస్ కౌన్సిల్, సిస్కో, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఆయన యూస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు అమీ, వాల్ మార్ట్ ఇండియా సీఈవో క్రిష్ అయ్యర్, హెచ్‌పి కంపెనీ డైరెక్టర్ అంబ్రిస్, బోస్టన్ సైంటిఫిక్ వైస్ ప్రెసిడెంట్ చక్రవర్తి తదితరులతో శుక్రవారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితులు గురించి వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల కోసం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను వారికి వివరించారు. వాల్‌మార్ట్ సంస్థ ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు సమావేశ అనంతరం మంత్రి లోకేష్ వెల్లడించారు. 15వేల మంది రైతులకు సహకారం అందించే విధంగా వారికి మంచి ధర కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వాల్‌మార్ట్ సంస్థ ప్రతినిధి క్రిష్ అయ్యర్ వెల్లడించారు. మరోవైపు నారా లోకేష్ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంక్షేమ కార్యకలాపాల గురించి వివరించారు. అలాగే ఏపీ భవన్‌లో మంత్రి నారా లోకేష్‌తో ఫేస్‌బుక్ ఇండియా గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఔట్‌రిచ్ మేనేజర్ నితిన్ సలుజాతో భేటీ అయ్యారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఫేస్‌బుక్ ముందుకు వచ్చినట్టు చెప్పారు.
డిజిటల్ లీడర్ ఆప్ ది ఇయర్ అవార్డు అందుకున్న లోకేష్
బిజినెస్ వరల్డ్ సంస్థ అధ్వర్యలో శుక్రవారం ఢిల్లీలో నాలుగో డిజిటల్ ఇండియా సదస్సులో మంత్రి నారా లోకేష్ ‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నందుకు సంస్థ ఈ అవార్డుకు మంత్రి నారా లోకేష్‌ను ఎంపిక చేసింది.

చిత్రం..‘డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంటున్న నారా లోకేష్