బిజినెస్

ఓఎన్‌జీసీ రిఫైనరీలో సోలార్ పవర్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 19: తూర్పుగోదావరి జిల్లా ఓఎన్జీసీ తాటిపాక రిఫైనరీలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ డైరెక్టర్ ( ఆన్‌షోర్) సంజయ్‌కుమార్ మెయిత్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈడీ అసెట్ మేనేజర్ శేఖర్ మాట్లాడుతూ పర్యావరణహితమైన కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంస్థ కృషి చేస్తుందన్నారు. సాంకేతికత, నిర్మాణానికి, నిర్వహణకు రూ.35 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్ 25 ఏళ్ళ పాటు సేవలు అందిస్తుందన్నారు. ఒక యూనిట్‌కు రూ.2.60పై ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి వస్తుందన్నారు. ఏడాదికి రూ.5.4 కోట్ల ఖర్చుతో 8.5 మిలియన్ యూనిట్ల ను విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని అంచనా అన్నా రు. ఈ సోలార్ పవర్ ప్లాంట్ జూలై నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విద్యుత్‌ను తాటిపాక సమీపంలోని సంస్థ కార్యాచరణ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ 2016లో బేస్ కాంప్లెక్సులో ఒక మెగావాట్ సామర్ధ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని, ఈ ప్లాంట్ ద్వారా 3.5 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసి సంస్థకు రూ.2.5 కోట్లు ఆదా చేసిందన్నారు.

చిత్రం..తాటిపాక రిఫైనరీలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన
సంస్థ ఆన్‌షోర్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మెయిత్ర