బిజినెస్

ఏం జరగబోతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 23: ఐరోపా ఖండంలో అత్యంత కీలక మార్పులకు దారితీయనున్న బ్రెగ్జిట్ ఓటింగ్ పూర్తయింది. యురోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా వద్దా అన్న అంశంపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఫలితాలపై ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వివిధ దేశాల మార్కెట్లపై దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతోందని మార్కెట్ నిపుణులు ఎదురుచూస్తున్నారు. సోమవారం ఉదయం ఓపెన్ అయ్యేసరికి ప్రపంచ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఆందోళన అన్ని దేశాల్లోనూ వ్యక్తమవుతోంది. బ్రిటన్ ఓటర్ల తీర్పు ఏ విధంగా చెప్తే ఏం జరుగుతుంది?
* శుక్రవారం ఉదయం బ్రెగ్జిట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడిస్తారు.
* ఫలితాల సరళి కాస్త స్పష్టం అయిన తరువాత ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన అధికార నివాసం 10డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఒక ప్రకటన చేస్తారు. సరళి ఎలా ఉన్నప్పటికీ ప్రకటన ఉంటుంది.
* వారాంతంలో కానీ, సోమవారం (జూన్ 27)న కానీ బ్రిటన్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతుంది.
* ప్రధాని కామెరాన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
* ఈయూలో బ్రిటన్ కొనసాగాలని ప్రజలు భారీ మెజారిటీతో తీర్పు చెప్తే, అది కామెరాన్ నాయకత్వంపై దేశం విశ్వాసం ప్రకటించినట్లవుతుంది.
* అలా కాకుండా ఈయూలో కొనసాగాలని స్వల్ప మెజారిటీతో తీర్పు ఇచ్చినా, లేదా బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటిచ్చినా అది కామెరాన్ సలహాను బ్రిటన్ ప్రజలు తిరస్కరించినట్లే అవుతుంది.
* బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఫలితం వస్తే కామెరాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు. కొత్త నాయకుడికి దారి చూపించాల్సి ఉంటుంది.
* ఒకవేళ బ్రిటన్ ఈయూ నుంచి బయటకు రావాలని ఓటేసినా, కామెరాన్ ప్రధాని పదవిలో కొనసాగాలని భావిస్తే, ఆయన ప్రతినిధిత్వం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీలో ఆయన సలహాను వ్యతిరేకిస్తున్న ఎంపిలు అంతర్గత విశ్వాస పరీక్షకు డిమాండ్ చేయవచ్చు. అదే జరిగితే కామెరాన్ బలవంతంగా పదవినుంచి తప్పుకోవలసి రావచ్చు.
* ఈయూలో కొనసాగాలని ఫలితం వస్తే ఈయూ దేశాలతో పాటు మార్కెట్లు కూడా ఫలితాన్ని ఆహ్వానిస్తాయి.
* ఒకవేళ ఈయూ నుంచి వైదొలగాలన్న తీర్పు వస్తే మాత్రం నిబంధనలు-షరతులపై చర్చలు మొదలవుతాయి. ఈ తతంగం పూర్తయ్యేసరికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది.
* బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేసినప్పటికీ, స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగేందుకు అంగీకరించాలని బ్రిటన్‌ను ఈయూ దేశాలు కోరవచ్చు.

చిత్రం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్