బిజినెస్
హోండా నుంచి సరికొత్త వాహనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మే 22: ప్రముఖ వాహన తయారీ సంస్ధ హోండా ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త వాహనాన్ని రాష్ట్ర మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్ధ సీఈఓ గాకు నకానిషి హోండా అమేజ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి హోండా అమేజ్‌ను రూపొందించానట్టు తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగ సిటివి విధానంతో ఈ వాహనాన్ని తయారు చేసినట్టు, అతి ఖరీదైన వాహనాలలో వుండే సౌకర్యాలన్నింటిని ఇందులో పొందుపరిచామని తెలిపారు. వాహన ప్రియుల అభిరుచులు, దేశంలోని రహదారులను బట్టి సంస్థ ఎప్పటికప్పు డు వాహనాలను అభివృద్ధి పరుస్తోందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వనగరంలో కార్ల విక్రయాలు నానాటికి పెరుగుతున్నాయని దానిని దృష్టిలో ఉంచుకొని తమ నూతన శ్రేణి వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.