బిజినెస్

మాల్యా, లలిత్‌మోదీ అప్పగింతలో సాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: విజయ్ మాల్యా, లలిత్ మోదీలను త్వరగా అప్పగించడంలో సహాయపడాలని, నీరవ్ మోదీ ఎక్కడున్నదీ తెలుసుకోవడంలో సహాయపడాలని, ఇక్కడ జరిగిన ఇండో- యూకే ఆంతరంగిక వ్యవహారాలపై జరిగిన చర్చల సందర్భం గా యూకేను కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో కశ్మీర్, ఖలిస్తాన్ వేర్పాటు వాదుల భారత వ్యతిరేక కా ర్యకలాపాలను బ్రిటన్‌లో అనుమతించరాదని కూడా కోరినట్టు వారు వెల్లడించారు. ‘మేం కోరుతున్న వ్యక్తులను భారత్‌కు ర ప్పించడంలో సహాయం చేయాలని యుకె అధికార్లను కోరాం. మాల్యా బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు’ అని ఒక అధికారి వివరించారు. ఈ చర్చల్లో భారత బృందానికి కేంద్ర హోంశాఖ కా ర్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహించగా, యూకే టీంకు పా ట్సీ విల్కిన్‌సన్ నాయకత్వం వహించారు. క్రికెట్ బుకీ సంజీవ్ కపూర్‌ను కూడా దేశానికి రప్పించడంలో సహాయం చేయాలని వారిని కోరినట్టు అధికార్లు వెల్లడించారు. మాల్యాపై సీబీఐ, ఈడీ లు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటివరకు ఆయన భారతీయ బ్యాంకులను రూ.9వేల కోట్ల మేర మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. 2016, మార్చి 2న ఆయన భారత్‌ను వదలి వెళ్లారు. అయితే నేరస్తుల అప్పగింత వారెంట్ కింద స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను 2017లో అరెస్ట్ చేశారు. దీనిపై బెయిల్ పొందిన ఆయన ప్రస్తుతం నేరస్థుల అప్పగింత కేసును బ్రిటన్ కోర్టులో సవాలు చేశారు. విచారణ కొనసాగుతోంది. పీఎన్‌బీ ని రూ.13,000 కోట్లకు ముంచిన కేసులో నిందితులైన నీరవ్ మో దీ ఆయన బంధువు మెహుల్ చోస్కీలు ఈ ఏడాది మొదట్లో భారత్ వదలి పారిపోయారు. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు వచ్చిన తర్వాత లలిత్ మోదీ భారత్‌ను వదలి వెళ్లారు. ఇదిలావుండగా బ్రిటన్‌లో విద్యనభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు వీసాలు జారీచేసే ప్రక్రియ కఠినంగా ఉన్న అంశాన్ని కూ డా అధికారులు యూకే దృష్టికి తీసుకొచ్చారు. వీసాకోసం పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడం, జారీలో విపరీతమైన జాప్యం వంటి సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.