బిజినెస్

భారత్ వృద్ధి రేటు అంచనా తగ్గించిన మూడీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: మూడీస్ భారత్ అభివృద్ధి అంచనాను రెండు శాతం తగ్గించింది. 2018 సంవత్సరానికి భారత్ ఆర్థిక ప్రగతి 7.5 శాతంగా గతంలో అంచనా వేసింది. అయితే దీన్ని 7.3 శాతానికి తగ్గిస్తూ తాజాగా అంచనా వేసింది. పెరిగిన చమురు ధరలు, ఆర్థిక పరిస్థితులు కఠినతరమైన నేపథ్యంలో, వృద్ధివేగం మందగిస్తుందని పేర్కొంది. అయితే 2019లో దేశ ఆర్థిక ప్రగతి 7.5 శాతంగానే ఉండబోతున్నదన్న తన అంచనాలో మార్పులేదని స్పష్టం చేసింది. గ్రామీణ వినియోగం వేగం పుంజుకోవడం, దీనికి మద్దతుగా కనీస మద్దతు ధరతో పాటు రుతుపవనాల సానుకూలతతో అభివృద్ధి ప్రయోజనం పొందాలని ‘గ్లోబల్ మ్యాక్రో ఔట్‌లుక్: 2018-19’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో మూడీస్ వివరించింది. ‘ ట్విన్ బ్యాలన్స్ షీట్ల సమస్యను, దివాలా చట్టం ద్వారా క్రమంగా పరిష్కరిస్తుండటంతోప్రైవేటు పెట్టుబడులు క్రమంగా కోలుకుంటున్నాయి’ అని పేర్కొంది. రాబోయే త్రైమాసికాల్లో వస్తుసేవల పన్ను, వృద్ధిరేటుపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్నదని అంచనా వేసింది. ఏడాది మొత్తంమీద చూస్తే ఈ సమస్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మూడీస్ స్పష్టం చేసింది.
ఇక ప్రపంచ ప్రగతి విషయానికి వస్తే, 2017లో మాదిరిగానే 2018లో కూడా ప్రగతివేగం బాగా పుంజుకోగలదని, అయితే సంవత్సరాంతంలో ఈ దూకుడు తగ్గి ఒక మాదిరి స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. ఇక 2019లో ప్రపంచంలోని చాలా ఆర్థిక వ్యవస్థలు ఉద్యోగాలను పూర్తిస్థాయిలో కల్పించే దశకు చేరుకుంటాయి. కానీ రుణాలు తీసుకునే ఖర్చు పెరగడం, రుణాలు అంత తేలిగ్గా మంజూరు కాకపోవడం వంటివి ఉద్గమిస్తున్న, అభివృద్ధి చెందిన మార్కెట్ల ప్రగతి వేగాన్ని నిదానింపజేస్తాయని పేర్కొంది.
జి-20 దేశాల ప్రగతి 2018లో 3.3 శాతం, 2019లో 3.2 శాతం నమోదు కాగలదని తెలిపింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 2018లో ఆర్థిక ప్రగతి 2.3 శాతం, 2019లో 2 శాతం వృద్ధి నమోదు చేస్తాయని పేర్కొంది. అదే జి-20కి చెందిన ఉద్గమిస్తున్న మార్కెట్లు ఈ రెండు సంవత్సరాల్లో 5.2 శాతం వృద్ధిని నమోదు చేయగలని వివరించింది. 2017లో వీటి ప్రగతి 5.3 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కాగా ఉద్గమిస్తున్న ఆర్థిక మార్కెట్లు ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్జెంటీనా, టర్కీ వంటి దేశాల ప్రగతి రేటు ప్రతికూల పరిణామాలకు లోనవుతుందని పేర్కొంది.