బిజినెస్

రెండోరోజూ మారని సీను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 30: వరుసగా రెండోరోజు కూడా స్టాక్ మార్కెట్లు మందకొడిగానే సాగాయి. మూడీస్ రేటింగ్ తగ్గడం, అమెరికా - చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో దాని ప్రభావం భారతీయ మార్కెట్లపై పడింది. ఈ పరిణామాలను ప్రతిబింబిస్తూ సెనె్సక్స్ 43 పాయింట్లు తగ్గి 34,906.11 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 18.95 పాయింట్లు తగ్గి 10,614.35 పాయింట్ల వద్ద ముగిసింది. చైనాతో వాణిజ్య యుద్ధ సెగలు రగిలిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఆసియా మార్కెట్లు బోల్తాకొట్టాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై భారీగా 25 శాతం సుంకాన్ని విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. అలాగే ఇటలీ పరిణామాలు కూడా భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. వీటి కారణంగా ఐరోపా యూనియన్‌లో ఇటలీ కొనసాగుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ కూడా బుధవారం నాటి మార్కెట్ లావాదేవీలపై తీవ్రంగానే ప్రభావం చూపాయి. మార్కెట్ ప్రారంభం నుంచి చివరి వరకు ఒడిదుడుకుల మయంగానే సాగింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారీగా అమ్మకాలు జరగడమే ఇందుకు కారణం. అన్ని కంపెనీల కంటే టాటా మోటార్స్ షేర్లు భారీగా అంటే 1.92 శాతం మేర తగ్గాయి. ఐసీఐసీఐ షేర్ విలువ కూడా 1.86 శాతం మేర తగ్గింది. బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అంట్ టీ, డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్ మొదలైన కంపెనీల షేర్లు వివిధ స్థాయిల్లో పతనమయ్యాయి. అయితే ఈ ప్రతికూల వాతావరణంలోనూ పుంజుకున్న కంపెనీలూ ఉన్నాయి. కోల్ ఇండియా షేర్ విలువ 2.34 శాతం మేర, ఎస్.బ్యాంక్, కోటక్ మహీంద్ర, హెచ్‌యుఎల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలు ఆర్జించాయి.