బిజినెస్

కృష్ణపట్నం టు నాగపూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, మే 30: ఆసియా తీరంలోనే అతి పెద్ద పోర్టుగా రూపుదిద్దుకుంటున్న కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి నాగపూర్‌కు నేరుగా కంటైనర్ రైల్వే సర్వీసును ప్రారంభించి మరో మైలురాయిని అధిగమించింది. కృష్ణపట్నం పోర్టు నుంచి కాంకార్ సహకారంతో నాగపూర్‌కు కంటైనర్ రైల్వే సర్వీసును ఓడరేవు సీఇఓ అనిల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నాగపూర్‌కు రైల్వే సర్వీసు ద్వారా మధ్యభారత రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఓడరేవు ద్వారా వ్యాపార అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఎగుమతులు, దిగుమతుల రంగంలో కృష్ణపట్నం పోర్టు దూసుకుపోతోందని, కృష్ణపట్నం పోర్టు మున్ముందు కంటైనర్ టెర్మినల్ మధ్య భారతదేశానికి గేట్ వేగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని పోర్టు సీఇఓ అని ల్ పేర్కొన్నారు. కేటీసీటీ ఏర్పాటైన అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద కంటైనర్ హార్బర్‌గా అవతరించిందని ఆయన తెలిపారు. కృష్ణపట్నం పోర్టు నుంచి నాగపూర్‌కు రైల్వే సర్వీసు ఏర్పాటు పోర్టు అభివృద్ధిలో ఒక మైలురాయిగా ఆయన వర్ణించారు. కేసీపీటీ డైరెక్టర్ వినితా వెంకట్ మాట్లాడుతూ పోర్టు అభివృద్ధి పనులను కొనియాడారు. నాగపూర్ కేంద్రంగా కంటైనర్ రైల్వేసర్వీసు ద్వారా పత్తి, ఫెర్రో, అల్లాయ్, బియ్యం, స్టీల్, ప్లాంట్‌మిషన్ టవర్లు, ఎగుమతులు, ఫర్నిచర్, కార్బోనేట్, జనరల్ కార్బో మొదలగు ఉత్పత్తులు దిగుమతులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కేపీసీటీ సీఓఓ జితేంద్ర, వేణుగోపాల్, కాంకార్ మాస్కలైన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.