బిజినెస్

చందాకొచ్చర్‌పై స్వతంత్ర దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 30: వీడియోకాన్‌కు భారీగా రుణాల అందచేతలో సీఈవో చందాకొచ్చర్ ఎదుర్కొంటున్న ‘క్విడ్ ప్రో కో’ అభియోగాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు భారతీయ దిగ్గజ ప్రయివేట్ బ్యాంకు ఐసీఐసీఐ బోర్డు వెల్లడించింది. వీడియోకాన్ సంస్థ (వేణుగోపాల్ ధూత్)కు రుణ సదుపాయం కల్పించడంలో చందాకొశ్చర్, ఆమె కుటుంబీకులు ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడ్డారన్న అభియోగాలు తలెత్తడం తెలిసిందే. బ్యాంకు నిబంధనలు తోసిరాజని వీడియోకాన్‌కు భారీ రుణ సదుపాయం కల్పించినందుకు, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన నుపవర్ రిన్యూవబుల్స్ సంస్థలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్న అభియోగాలూ ఉన్నాయి. ఇదిలావుంటే ఐసీఐసీఐ బ్యాంకుతో వీడియోకాన్ గ్రూప్, నుపవర్ సంస్థ లావాదేవీలను ప్రశ్నిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి గతవారం చందాకొచ్చర్‌కు నోటీసులు జారీ చేసింది. మరోపక్క మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో కొచ్చర్‌పై ‘ఆగంతక శ్రేయోభిలాషి’ చేసిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో భాగంగా బ్యాంకు వెల్లడించింది. మొత్తం వ్యవహారంపై విశ్వసనీయ సమర్థ వ్యక్తితో దర్యాప్తు జరిపిస్తామని, అదే సమయంలో ‘ఆగంతక శ్రేయోభిలాషి’ ఫిర్యాదునూ పరిగణనలోకి తీసుకుంటామని బ్యాంకు వెల్లడించింది. ‘క్విడ్ ప్రో కో’ అభియోగాలకు సంబంధించి అన్ని కోణాల్లో విస్తృత దర్యాప్తు జరపుతామని, ఫోరెన్సిక్, ఈ-మెయిల్ రివ్యూలు, రికార్డు స్టేట్‌మెంట్లు అన్నింటినీ పరిశీలిస్తామని బ్యాంకు వెల్లడించింది.
బ్యాంకు విధి విధానాలను ఉల్లంఘించి సీఈవో చందాకొశ్చర్ ‘వ్యక్తిగత ఆసక్తులకు’ ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గత ఏప్రిల్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తినపుడు బోర్డు వాటిని కొట్టిపారేసింది. ఆమె పనితీరు, సమర్థతపట్ల పూర్తి విశ్వాసానే్న వ్యక్తం చేసింది. వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేయడంలోనూ ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడినట్టు దాఖలాలు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే, స్టాక్ మార్కెట్ ముగిసిన తరువాత రెగ్యులేటరీ ఫైలింగ్‌లో భాగంగా చందాకొశ్చర్‌పై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు బ్యాంకు బోర్డు ప్రకటించటం గమనార్హం.