బిజినెస్

అంతర్జాతీయ మార్కెట్‌లో అరకు కాఫీకి తగ్గిన ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 31: ప్రపంచ మార్కెట్‌లో అరకు కాఫీకి ఆదరణ తగ్గిపోతోంది. గత రెండేళ్ళగా కాఫీ పంట ఆశాజనకంగా లేకపోవడం, ప్రభుత్వం నుంచి గిరిజన రైతులకు ప్రోత్సాహాకాలు లేకపోవడం, పంట అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టకపోవడం వంటివి ఆదరణ తగ్గిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. కాఫీ పంటను అన్నివిధాలా అభివృద్ధి చేయడంలో భాగంగా ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మూడేళ్ళ కిందట ‘పదేళ్ళ కాఫీ ప్రాజెక్టు’ను ప్రారంభించాయి. గిరిజన రైతులకు లాభసాటిగా ఉంటుందని భావించిన ఈ రెండు సంస్థలు దళారీ వ్యవస్థను నిర్మూలించి గిరిజన రైతులు పండించే కాఫీని నేరుగా కొనుగోలు చేస్తూనే ఈ పంటను విశాఖ జిల్లాలో 11 ఏజెన్సీ మండలాల్లో లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా దాదాపు లక్షన్నర ఎకరాల్లో కాఫీ పంటను అభివృద్ధిపర్చి గిరిజన రైతుల ద్వారా కాఫీ గింజల సేకరణకు తొలిసారిగా 2015లో శ్రీకారం చుట్టాయి. అయితే తొలి ఏడాది వెయ్యి మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా 700 మెట్రిక్ టన్నుల వరకు సాధించింది. ఆ తరువాత ఏడాది మాత్రం 1500 మెట్రిక్ టన్నుల వరకు సాధించగలిగింది. ఈ ఏడాది కూడా 1500 నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న జీసీసీ ఈ నెలాఖరుతో గడువు ముగియడంతో దాదాపు వెయ్యి మెట్రిక్ టన్నులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీలో విశాఖ జిల్లా ఏజెన్సీ మండలాలు చింతపల్లి, గూడెం కొత్తవీధి, లంబసింగి, అనంతగిరి, అరకు, ముంచింగ్‌పుట్ తదితర మండలాలకు సంబంధించి 50 నుంచి లక్ష మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణను కాఫీబోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంట దిగుబడి అంతగా ఆశాజనకంగా లేకుండాపోయిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గడచిన మూడేళ్ళల్లో ఏ ఏడాది కూడా జీసీసీ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరకపోవడంతో, ఏపీ మొత్తంమీద అత్యధిక పంట దిగుబడి విశాఖ జిల్లా నుంచే సాధించాల్సి ఉన్నా ఈసారి కూడా వెనుకబడిపోయింది. దీంతో ప్రపంచ మార్కెట్‌లో ఇపుడు బ్రెజిల్, వియత్నాం కాఫీ అత్యధికంగా అమ్ముడుపోతోంది. అమెరికా, కెనడా, రష్యా, గల్ఫ్ దేశాలకు సైతం బ్రెజిల్ కాఫీ భారీగా ఎగుమతి అవుతోందని ఇక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌ను బ్రెజిల్, వియ త్నం కాఫీ శాసిస్తోంది. ప్రపంచ దేశాలకు బ్రెజి ల్ కాఫీ భారీగా సరఫరా అవుతుండగా, ఆ తరువాతి స్థానంలో వియత్నాం కాఫీ నిలుస్తోం ది. బ్రెజిల్, వియత్నాంలో పండే కాఫీ నెంబర్ క్వాలిటీకి చెందినది కావడం, అక్కడి రైతులకు గిట్టుబాటు కల్పించడం, అందుబాటు ధరలకే మార్కెట్‌లో విక్రయిస్తున్న పరిస్థితులతో అక్క డ ఆదరణ పెరుగుతోందనేది స్పష్టమవుతోంది.