బిజినెస్

నాలుగేళ్లు నిలకడగా జీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గతనాలుగేళ్లలో స్ధూల జాతీయోత్పత్తి 7.3 శాతం ఉండేటట్లు చర్యలు తీసుకుందని, అతకు ముందు ఐదేళ్లలో జిడిపి 7.5 శాతం ఉండేదని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్‌మేషన్ సర్వీసస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసెల్) పేర్కొంది. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, అలాగే వైఫల్యాలపై క్రెసిల్ రేటింగ్ ఇచ్చింది. ఈ మేరకు వివరాలను విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవా పన్ను లాంటి కీలకమైన విధానాలను అమలు చేసినా, జిడిపి 7.3 శాతం నిలకడగా ఉండేడట్లు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అలాగే వినిమయ ధరల సూచిక, ద్రవ్యోల్బణం 2015 నుంచి 2017 మధ్య 4.7శాతం మేర తగ్గింది. అంతకు ముందు ఐదేళ్లలో ఈ అంశాల్లో 10.2 శాతం ఉండేదన్నారు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది. రుతుపవనాలు బాగున్నాయి, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి బాగుంది. కనీస గిట్టుబాటు ధరలు కల్పించారు. ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల వడ్డీ రేట్లు తగ్గాయి. ద్రవ్యవిధానం సరళీకృతం చేశా రు. రెపో రేటును 200 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఆర్‌బిఐ ద్రవ్య విధానం తటస్థవైఖరిని అవలంబించింది. ఆర్థిక లోటు 2014 నుంచి 2018లో 5.2 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గింది. కరెంట్ అకౌంట్ లోటు తగ్గింది. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. వ్యవసాయ రంగంలో జిడిపి వృద్ధి 4.3 శాతం నుంచి 2.4 శాతానికి తగ్గింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2010-14 మధ్య 19.5 శాతం వృద్ధిరేటునమోదు చేయగా, ఈ మొత్తంలో 3.1 శాతం మేరకు ఎగుమతులు తగ్గాయి. రా ష్ట్రాల్లో సగటు ఆర్థిక లోటు 2.2 శాతం నుంచి 3.2 శాతానికి పెరిగింది. నిరర్ధక ఆస్తుల విలువ 2010లో 2.96 శాతం ఉంటే, 2015-18మధ్య 7.95 శాతానికి పెరిగాయి. కొత్త జిడిపి వివరాలను విశే్లషిస్తే, 2012- 2014 మధ్య 17.3 శాతం పెరిగితే, నాలుగేళ్లలో 17.9 శాతం పెరిగింది.