బిజినెస్

రెండో రోజూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: దేశ వ్యాప్తంగా రెండవ రోజు కూడా బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ దేశంలోని 21 జాతీయ బ్యాంకులకు చెందిన సిబ్బంది చేపట్టిన సమ్మె రెండవ రోజు గురువారం కూడా జయప్రదంగా ముగిసింది. దాదాపు పది లక్షల మందికిపైగా ఉద్యోగులు సమ్మెలోపాల్గొన్నారు. కేవలం రెండు శాతం మాత్రమే వేతనాలు పెంచుతామని ఇండియన్ బ్యాంకు యాజమాన్య సంఘాలు స్పష్టం చేయడంతో, బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ బ్యాంకుల్లో లావాదేవీలు అతలాకుతలమయ్యాయి. డిపాజిట్లు స్వీకరణ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపునరుద్ధరణ, ప్రభుత్వ ట్రెజరీ కార్యకలాపాలు స్తంభించాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ (యుఎఫ్‌బియూ) ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒక వేదికపైకి వచ్చి సమ్మె చేశాయి. జాతీయ బ్యాంకులతోపాటు, వీరికి మద్ధతు ఇచ్చిన కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో కలిపి 80 లక్షల చెక్‌లు క్లియరెన్స్‌కు నోచుకోలేదు. సమ్మె సంపూర్ణంగా జరిగిందని, అన్ని బ్యాంకుల బ్రాంచిల్లో సిబ్బంది సమ్మె చేశారని యుఎఫ్‌బియూ ప్రకటించింది. ముంబాయి, ఢిల్లీ, కోల్‌కొతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, నాగ్‌పూర్, జమ్ము, గువహటి, జెంషెడ్‌పూర్, లక్నో, ఆగ్రా, అంబాలా, త్రివేండ్రం,విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో బ్యాంకు సిబ్బంది బ్యాంకుల బయట నిరసన ప్రదర్శన చేశారు. 21 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 85వేల బ్రాంచిలు ఉన్నాయి. దేశంలోని బ్యాంకు లావాదేవీల్లో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే జరుగుతాయి. ఇండియా బ్యాంకు ఆఫీసర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి హర్వీందర్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ, తమ డిమాండ్ల సాధనకు ఉద్యమాన్ని భవిష్యత్తులో తీవ్రతరం చేస్తామన్నారు. ఫెడరల్ బ్యాంకు, కేథలిక్ సిరియన్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకులు కూడా తమ సమ్మెకు మద్దతు ఇచ్చాయన్నారు. దేశంలో 56 ప్రాంతీయ బ్యాంకులకు చెందిన బ్రాంచిల సిబ్బంది తమ సమ్మెకు పూర్తిగా మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.